cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ సినిమా షూటింగ్ నీకు అవసరమా లోకేష్!

ఈ సినిమా షూటింగ్ నీకు అవసరమా లోకేష్!

వరద టైమ్ లో బురద రాజకీయం చేయాలనుకున్నారు నారా లోకేష్. అందుకే నీట్ గా రెడీ అయి.. ఫ్యాంట్ మోకాలి వరకు మడతపెట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వచ్చేశారు. బురదలో దిగి.. పంట చేతబట్టుకుని రైతులతో కలసి ఫొటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి పర్యటన కంటే ఎక్కువగా దీనికి ప్రయారిటీ ఇచ్చింది.

అంతా బాగానే ఉంది కానీ, వరదలో కూడా లోకేష్ బురద రాజకీయాన్ని జనం అసహ్యించుకున్నారు. సినిమా షూటింగ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగింది లోకేష్ పర్యటన. ముందుగానే సర్వే చేయించుకొని, కరోనా ప్రభావం పెద్దగా లేదని నిర్థారించుకున్న ప్రాంతాల్లో మాత్రమే లోకేష్ పర్యటించారు. అంతేకాదు.. తనను ఎవ్వరూ టచ్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు.

లోకేష్ పర్యటన మొత్తాన్ని ఓ స్పెషల్ బ్యాచ్ కవర్ చేసింది. లోకేష్ ప్రతి అడుగులో శానిటైజేషన్ చేయడం, మాస్కులు మార్చడం, మనుషుల్ని దూరంగా ఉంచడం లాంటివి ఈ బ్యాచ్ పని. అయితే ఈ వ్యవహారం ఎక్కడా ఫొటోల్లో కానీ, వీడియోల్లో కానీ రాకుండా జాగ్రత్త పడింది లోకేష్ టీమ్.

మనసులో ఇంత భయం పెట్టుకొని, మనుషుల్ని ముట్టుకోడానికి కూాడ భయపడే లోకేష్.. పరామర్శకు రావడం ఎందుకని అసహ్యించుకుంటున్నారు జనం. అయితే లోకేష్ ఎజెండా వేరు. ఆయనకు కావాల్సింది ప్రచారం. 

దానికోసమే టీడీపీ అనుకూల వర్గాన్ని వెంటేసుకొని, ముందుగానే పచ్చ మీడియాకు మార్గనిర్దేశం చేసి మరీ కాలు బయటపెట్టారు చినబాబు. స్టార్ట్, యాక్షన్, కెమెరా అనగానే కారులో నుంచి బైటకు దిగడం.. కట్ చెప్పగానే వెంటనే కారులోకి దూరిపోవడం ఆర్డర్ ప్రకారం జరిగిపోయాయి.

మొత్తమ్మీద లోకేష్ పరామర్శ యాత్ర.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంటే జాగ్రత్తగా జరిగింది. మరోవైపు కొడాలి నాని లాంటి నేతలు మాత్రం ఎప్పట్లానే లోకేష్ గాలి తీసేశారు. లోకేష్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి కూడా నిరాకరించారు. 

ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే సమాధానం చెబుతామని, కనీసం ఓ ఎమ్మెల్యే ప్రశ్నించినా సమాధానం చెబుతామని.. లోకేష్ విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చేశారు. 

నన్నెవడూ పీకలేడు

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

 


×