Advertisement

Advertisement


Home > Politics - Political News

సెల్ఫీ రాజా.. నీకు పోలవరం అవసరమా..?

సెల్ఫీ రాజా.. నీకు పోలవరం అవసరమా..?

మాజీమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసినా, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్.. సడన్ గా ట్విట్టర్ లో రూటు మార్చారు. ఇప్పటి వరకూ ఆయన ఓ రకమైన ట్వీట్లకే అలవాటు పడ్డారు. మురళీమోహన్ లాంటి వారి పరామర్శలు, బాలా మావయ్యా అంటూ జన్మదిన శుభాకాంక్షలు, పెద్దల వర్థంతులకు సంతాప సందేశాలు, సెల్ఫీలు.. ఇలా ఆయన ట్విట్టర్ అకౌంట్ నిర్మలంగా, నిశ్చలంగా సాగిపోతుండేది. ఎప్పుడైనా పొరపాటున రాజకీయాల టచ్ చేస్తే.. ట్రోలింగ్ దెబ్బకు విలవిల్లాడిపోయేవారు లోకేష్.

అయితే తాజాగా లోకేష్ ఇస్తున్న మెసేజ్ లు చూస్తుంటే.. పిల్లాడు ప్లే గ్రౌండ్ నుంచి పొలిటికల్ గ్రౌండ్ వైపు అడుగులేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఆ ప్రయత్నం కూడా అభాసుపాలవుతోందనుకోండి. రాజ్యసభ సభ్యులు పార్టీ మారినప్పుడు సీనియర్లను లోకేష్ ఓదార్చడం చూసి, నీకంత సీన్ లేదంటూ నెటిజన్లు పెదవి విరిచారు. తాజాగా పోలవరం లాంటి పెద్ద సబ్జెక్ట్ ని డీల్ చేయాలనుకొని మరోసారి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు లోకేష్.

పోలవరం పని 70శాతం పూర్తయిందట, మిగిలిన 30శాతం పనుల్ని వైసీపీ, బీజేపీ కలసి పూర్తి చేయాలట. ఇదీ తాజాగా లోకేష్ పెట్టిన కామెడీ ట్వీట్. కాఫర్ డ్యామ్ పేరుతో, అనుకూల మీడియాని చేతిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి డ్రామాలాడిందో ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తోంది. సీఎం జగన్ పోలవరం సందర్శనతో ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పోలవరం ఇంకా మొదలే కాలేదనే విషయం స్పష్టమైంది. తాజాగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం 55,548కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు రాజ్యసభలో ప్రకటంచింది. ఆ లెటర్ ని పట్టుకుని లోకేష్ రెచ్చిపోతున్నారు.

తమ గొప్పతనం వల్లే పోలవరానికి నిధులొచ్చాయని, అంచనాల్లో తప్పుల్లేవని కేంద్రమే ఒప్పుకుందని, ఇక బీజేపీ, వైసీపీ విమర్శలకు కాలం చెల్లిందంటూ రెచ్చపోతున్నారు. అయితే పోలవరం పనులు 70 శాతం పూర్తయ్యాయని లోకేష్ చెప్పిన మాటలు ఆయన అవివేకానికి నిదర్శనంగా మారాయి. ఇక్కడ మరోసారి నెజిటన్లకు దొరికిపోయాడు చినబాబు. పోలవరం గురించి నీకు అవసరమా అంటూ లోకేష్ కు క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టారు నెట్ జనం.

అయితే రాజధాని, పోలవరం, పింఛన్లు, ఉద్యోగాలంటూ మాట్లాడే లోకేష్.. తన శాఖకు సంబంధించిన వివరాల్ని మాత్రం ఎప్పుడూ బైటపెట్టలేదు. అలా బైటపెట్టాల్సి వస్తే అప్పట్లో తాను జారీ చేసిన చీకటి జీవోల గురించి చెప్పాల్సి వస్తుందని లోకేష్ భయం. ఐటీ కారిడార్ల పేరుతో లోకేష్ చేసిన అక్రమాలన్నీ త్వరలోనే కూపీ లాగబోతోంది వైసీపీ సర్కార్. అప్పటివరకూ ఇలా ట్విట్టర్ లో లోకేష్ ఎన్ని ట్వీట్లు అయినా పెట్టుకోవచ్చు. 

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?