Advertisement

Advertisement


Home > Politics - Political News

లాస్ట్ వార్నింగ్‌..ఇక ఊరుకోం

లాస్ట్ వార్నింగ్‌..ఇక ఊరుకోం

బీజేపీ నేత‌ల‌కు తెలంగాణ మంత్రి, సీఎం త‌న‌యుడు కేసీఆర్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ బీజేపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ వ‌య‌సు, హోదా చూడ‌కుండా బీజేపీ నేత‌లు దూషిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక మీద‌ట కేసీఆర్‌ను దూషిస్తే మాత్రం ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఉగాదికి ఒక రోజు ముందే వ‌రంగ‌ల్ న‌గ‌రానికి తాగునీరు అందించామ‌న్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. తామిచ్చిన డ‌బ్బుకు రెట్టింపు సొమ్మును కేంద్రం నుంచి తీసుకొస్తారా? అని బీజేపీ నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు.

మోదీ ఇచ్చిన కొలువులెన్ని? అమ్మిన సంస్థలెన్ని? నిరుద్యోగి సునీల్‌ను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యువతను గందరగోళానికి గురిచేయొద్దని ఆయ‌న హిత‌వు ప‌లికారు. 

తెలంగాణ యువకులు క్షణికావేశానికి గురి కావొద్ద‌ని కేటీఆర్ కోరారు. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేయవద్దన్నారు. కొందరు నాయకులు సిగ్గులేకుండా మాట్లాడు తున్నారని మండిప‌డ్డారు. త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

కేయూ స్టూడెంట్ సునీల్‌ను రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడని కేటీఆర్ అన్నారు. ఐఏఎస్ కావాల్సిన వాడినని బోడ సునీల్ వీడియోలో చెప్పాడ‌న్నారు. ఐఏఎస్ భర్తీ చేసే నోటిఫికేషన్లు ఎవరిస్తారు? అని బీజేపీ నేత‌ల‌ను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ఉత్తమ్ ఎక్కడున్నార‌ని కేటీఆర్‌ ప్రశ్నించడం గ‌మ‌నార్హం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?