cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

లవ్ 'స్టోరీ'ని లీక్ చేసిన పాటల రచయిత

లవ్ 'స్టోరీ'ని లీక్ చేసిన పాటల రచయిత

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి లీకులు బయటకు రాలేదు. సినిమా ట్రైలర్ చూస్తే.. నిరుద్యోగులైన హీరోహీరోయిన్లు ఏదో ఆశయం కోసం ముందుకెళ్తుంటారని, డ్యాన్స్ అనేది వాళ్ల కామన్ ప్లస్ పాయింట్ అని మాత్రమే తెలుస్తుంది. తర్వాత లవ్ లో పడడం, దాన్ని సాధించుకోవడం లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ట్రయిలర్ లో డీటెయిల్డ్ గా చెప్పేశారు కూడా. అయితే ఆ ట్రైలర్ రిలీజైన మరుసటి రోజే.. సినిమా స్టోరీని లీక్ చేశారు పాటల రచయిత మిట్టపల్లి సురేందర్. అనుకోకుండా స్టోరీ లైన్ చెప్పేశారు.

లవ్ స్టోరీ సినిమాలో 'నీ చిత్రం చూసి' అనే పాట పెద్ద హిట్టయింది. ఆ పాట రాసిన యువ రచయిత మిట్టపల్లి సురేందర్ ఓ న్యూస్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పాట నేపథ్యాన్ని, తనకు అవకాశం ఎలా వచ్చిందనే విషయాన్ని చెప్పాడు. అయితే అక్కడితో ఆగకుండా పాట రాయడానికి వెళ్లినప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల తనకు స్టోరీ చెప్పారంటూ ఆ స్టోరీని మీడియాకు చెప్పేశారు. 

సహజంగా ఇలాంటి లైన్ బయటకొచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో దాన్ని ఎడిట్ చేసి వేస్తుంటారు. కానీ పాటల రచయితకు ఇలాంటి అనుభవం కొత్త కావడంతో ఆయన కూడా దాని గురించి పట్టించుకోలేదు. దీంతో ఆ పత్రికలో ఆయన చెప్పిన స్టోరీ యథాతథంగా వచ్చేసింది.

"కథ ప్రకారం హీరోహీరోయిన్ల ప్రేమని పెద్దవారు ఒప్పుకోరు. ఓ అసాధ్యమైన షరతుని పెట్టి అందుకు గడువు విధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటే తప్ప ప్రేమని గెలిపించుకోలేమని భావించిన హీరో నాగచైతన్య విదేశాలకి వెళ్తాడు. అతడికి హీరోయిన్ సాయి పల్లవి వీడ్కోలు చెప్పే సందర్భంలో తన పాట వస్తుంది" అని చెప్పాడు లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్.

లవ్ స్టోరీ ట్రైలర్ చూసినా, దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు చూసినా అంతా పల్లెటూరి వాతావరణంలో సాగే కథ అని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు పట్టణానికి వెళ్లి జాబ్ ట్రయల్స్ వేసి ఫెయిలవుతుంటారని ట్రైలర్ చెబుతోంది. ఫారిన్ ఎపిసోడ్ మాత్రం ఇంకా ఎక్కడా లీక్ కాలేదు. అసలు హీరో ఫారిన్ వెళ్తాడని, అక్కడ కొంత కథ జరుగుతుందని కూడా ఎక్కడా లీక్ అవ్వలేదు.

పాటల రచయిత చెప్పిన దాన్నిబట్టి, హీరో సదరు కండిషన్ ప్రకారం విదేశాలకు వెళ్తాడు. అక్కడ ఆయన సక్సెస్ అయ్యి ఇండియాకి తిరిగొచ్చి తన ప్రేయసిని చేపడతాడు. ఈ క్రమంలో జరిగే సంఘర్షణే లవ్ స్టోరీ. ఈ ఎపిసోడ్ ని దాచి పెట్టి సినిమా విడుదల తర్వాత సర్ ప్రైజ్ చేద్దామనుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములకి పాటల రచయిత ముందే షాక్ ఇచ్చినట్టున్నాడు.

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×