Advertisement

Advertisement


Home > Politics - Political News

మహేష్ Vs బన్నీ.. మళ్లీ కొట్టుకుంటున్న ఫ్యాన్స్

మహేష్ Vs బన్నీ.. మళ్లీ కొట్టుకుంటున్న ఫ్యాన్స్

గతేడాది సంక్రాంతి టైమ్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మా సినిమా హిట్ అంటే, కాదు మా సినిమా పెద్ద హిట్ అంటూ బన్నీ, మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. దీనికి మరింత ఆజ్యం పోస్తూ.. నిర్మాతలు కూడా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వసూళ్లను పోస్టర్ల రూపంలో విడుదల చేస్తూ రచ్చ రచ్చే చేశారు. కాలంతో పాటు సమసిపోయిన ఆ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది.

మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠపురములో సినిమాల్లో ఏది ఇండస్ట్రీ హిట్ అనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. దీనికి కారణం ఐఎండీబీకి చెందిన బాక్సాఫీస్ మోజో అనే సైట్. ప్రతి ఏటా వరల్డ్ వైడ్ సినిమాల గ్రాస్ ను విడుదల చేస్తుంటుంది ఈ సంస్థ. ఈసారి కూడా అదే పని చేసింది.

2020 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు (గ్రాస్) సాధించిన సినిమాల జాబితాను విడుదల చేసింది బాక్సాఫీస్ మోజో. ఇందులో సరిలేరు నీకెవ్వరు సినిమాకు 41వ స్థానం కట్టబెట్టింది. అంటే.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యథి క వసూళ్లు సాధించిన టాప్-50 చిత్రాల్లో మహేష్ సినిమా నిలిచిందన్నమాట. ఈ లిస్ట్ లో అల వైకుంఠపురములో సినిమా లేదు.

ఇంతకీ తేడా ఎక్కడ జరిగింది..

తాజా జాబితాతో మహేష్ ఫ్యాన్స్ మరోసారి హంగామా చేశారు. అల వైకుంఠపురములో సినిమా కంటే మహేష్ మూవీనే హయ్యస్ట్ గ్రాసర్ అని, అసలైన ఇండస్ట్రీ హిట్ తమ హీరో సినిమాదేనంటూ ట్రెండింగ్ మొదలుపెట్టారు. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. 

వాస్తవం ఏంటంటే.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు డొమెస్టిక్ (ఇండియా) వసూళ్లు కలిపారు కానీ అల వైకుంఠపురములో సినిమాకు డొమస్టిక్ కలెక్షన్లు యాడ్ చేయలేదు. దీంతో బన్నీ సినిమాకు లిస్ట్ లో స్థానం దక్కలేదు.

అల వైకుంఠపురములో నిర్మాతలు ఫేక్ వసూళ్లు ఇచ్చారు కాబట్టే మోజోలో అప్ డేట్ చేయలేదంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం లోకల్ కలెక్షన్లు ఎంతో కొంత చూపించకుండా, మొత్తంగా జీరో చేసి లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారంటూ వాదిస్తున్నారు. ఇలా మహేష్-అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఆన్-లైన్ వార్ మరోసారి మొదలైంది.

గతంలో గొడవేంటి..

మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు 3 రోజుల్లో 103 కోట్ల రూపాయల గ్రాస్ అంటూ ప్రకటించేశారు మేకర్స్. అల వైకుంఠపురములో సినిమాకు ఒక రోజులోనే 85 కోట్ల రూపాయల గ్రాస్ అని ప్రకటిస్తే, మహేష్ మూవీకి 3 రోజుల్లో 103 కోట్ల గ్రాస్ అని చెప్పుకున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల వసూళ్లలో తేడాలున్నాయి. 

ఇవి అసలైన కలెక్షన్లు కానే కావు. మహేష్, బన్నీ ఇద్దరూ ఇలా వసూళ్లు ఘనంగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఇలా పోటీపడి కలెక్షన్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.

అలా మొదలైన ఈ రెండు సినిమాల గొడవ.. తాజా వ్యవహారంతో మరోసారి తెరపైకొచ్చింది. ఇండస్ట్రీ హిట్ తమదంటే తమదేనంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా పేజీల్లో తెగ గొడవ పడుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?