Advertisement

Advertisement


Home > Politics - Political News

సెక్స్ కోరికలు తగ్గడానికి మెయిన్ రీజన్ అదేనంట!

సెక్స్ కోరికలు తగ్గడానికి మెయిన్ రీజన్ అదేనంట!

ఓ వయసు దాటిన తర్వాత కూడా స్త్రీపురుషుల్లో చాలామందికి శృంగార కోరికలుంటాయి. వాళ్లకు ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. కానీ సరిగ్గా ఆ టైమ్ వచ్చేసరికి చాలామంది నిద్రపోవడమో, మరో పనిలో పడిపోవడమో చేస్తారు. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనక కారణాలేంటి?

ఇదే విషయంపై ఓ రీసెర్చ్ జరిగింది. సామర్థ్యం ఉన్నప్పటికీ సెక్స్ పై అనాసక్తికి ఒత్తిడే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. శృంగార కోరికలు ఎందుకు తగ్గిపోతున్నాయో తెలుసుకోవడానికి, ఆ కోరికలపై పరిసరాల ప్రభావం ఎంత ఉంటుందో కనుక్కొనేందుకు ఓ సైంటిఫిక్ అధ్యయనం జరిగింది.

మెదడులో ఓ భాగం ఎమోషన్స్ ను ప్రాసెస్ చేస్తుందనేది ఇప్పటికే నిరూపితమైంది. ఆ భాగంలోనే లైంగిక ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. ఇది భయం, ప్రేమ, నిరాశ, దూకుడు, ఆరాధన లాంటి భావోద్వేగాల్ని పంప్ చేస్తుంది. స్త్రీ పురుషుల్లో లైంగిక ప్రేరణ రేకెత్తించడానికి ఈ భాగం పరోక్షంగా బాధ్యత వహిస్తుంది.

ఎక్కువ ఒత్తిడి, నిరాశ ఉండే వాతావరణంలో మెదడులోని పైన చెప్పుకున్న భాగం సెక్స్ ఎమోషన్స్ ను పంప్ చేయలేకపోయిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు.

అధిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో లైంగిక ప్రేరేపణలు, శృంగారభరిత మాటలు ఉన్నప్పటికీ.. స్త్రీ పురుషులు సెక్స్ పట్ల విముఖత చూపుతున్నట్టు అధ్యయనంలో తేలింది.

శృంగార జీవితాన్ని అనుభవించాలనుకునే వ్యక్తులు రోజువారీ ఒత్తిడిని కాస్త తగ్గించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా పిల్లల కోసం ప్రయత్నించే భార్యాభర్తలు తమ పని ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెబుతున్నారు.

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!

మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?