cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మళ్లీ ఆత్మగౌరవం నినాదం మారానని ప్రచారం

మళ్లీ ఆత్మగౌరవం నినాదం మారానని ప్రచారం

2019 ఎన్నికల్లో  ఘోరంగా ఓటమి పాలయిన చంద్రన్న అండ్‌కోకి ఈమద్యకాలంలో వీసమెత్తు మార్పురాలేదు. ఓటమికి తొలిరోజున ప్రజల్ని ఇంత బాధపెట్టామా? అయ్యో! గ్రహించలేకపోయానని ఓటమిబాధలో చంద్రబాబు దిగాలు ముఖంతో చెప్పారు. ఏ పచ్చమీడియా యజమానో అడ్డంపడి ఇలా చెప్పమాకు చంద్రయ్యా అనిచెప్పి ఉంటాడు. ఇలా ఒప్పుకుంటే ఈఐదేళ్లూ ప్రజలను వేధించానని బాబే ఒప్పుకున్నారు అనేది వెంటాడుతుంది. కనుక మరోమాట చెప్పు అని నూరిపోత జరిగింది. దాంతో ఎందుకు ఓడామో అర్ధం కావడంలేదని మాత్రమే చెప్పడంలో బాబు ఆగోల్డెన్‌ వరడ్సుపై నిలువెత్తు నిలబడిపోయారు. ఆపార్టీలో ఎవరికి కదిపినా ఎందుకు ఓడామంటే సాక్షాత్తు చంద్రబాబుకే తెలియలేదు. పార్టీకి మూలవిరాట్టు, పార్టీని, అధికారాన్ని నీటముంచినా పాలముంచినా బాబుదే భారం. అందుకే, ఆయన వెంటపడి నడిచాం, నడుస్తాం అని వసపట్టిన చిలుకల్లా సమస్తక్యాడర్‌ ఓటమికి కారణం తెలియదన్నట్లు చెబుతోంది.

బాబుకు సోషల్‌ మీడియాలో వస్తున్న అటకబుర్లు, జోస్యం కబుర్లు, పార్టీ త్వరలో దుంపధూళి అయ్యే కబుర్లు నిద్రపోనీయడంలేదు. అధికారంలో సాగితే ఒంటికాలిపై నడిచే బాబు ఓ సీతయ్యలా ఎవరిమాట విననన్నట్లుంటారు. గతంలో రెండుసార్లు ఓటమికంటే ఈసారి ఘోరఓటమి జీర్ణించుకోలేనిదిగా ఉంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి ఏదో చూరుపట్టుకుని వెళ్లాలి. అదెలాగో అంతుబట్టని పరిస్థితిలో మహా అపరాధిలా మిగిలిపోయారు. బాబుకు ఇతరుల నుంచి ఆస్వాదించి నచ్చితే దాన్ని ఆచరించడమే తెలుసు. స్వంతాలోచనలే లేని తలకాయ బాబుది. ఎలా జనాల్లోకి దూసుకు వెళ్లాలో అర్ధంకాలేదు. ప్రజల్లో మైక్‌ పట్టుకోవడానికి ఒక్కశాతం అర్హతలేని చంద్రన్నకు దారి అగమ్యగోచరమయ్యింది. నిత్యం బాబు చేసిన కానిపనులకు, హింసాత్మకపనులకు బాజాలు భజంత్రీలు మ్రోగించిన పచ్చమీడియా కలాలు  ముందుకు కదలట్లేదు. ఎలా బాబును ప్రజల్లోకి వెళ్లేలా చేయడానికి తగు కథనాలు తయారీలో దారులు కన్పించడంలేదు.

చివరికి పాత ఎత్తుబడి రాతలవైపే మొగ్గారు. అదేమంటే బాబు ఓటమికి పలువురు అమ్మ లక్కలు బాబును చుట్టేసి కన్నీరుమున్నీరు అయిపోతున్నారు అనే వార్తా  కథనం మాంచి దినుసులతో రంగరించి వండేసి జనాల్లో వడ్డించేసారు. ఆ కథనంతో వాడవాడలా, గల్లీగల్లీల్లో బాబు ఓటమికి కన్నీరుమున్నీరైన అమ్మలక్కలు బాబును కలుసుకోవడానికి క్యూ కడతారని పచ్చమీడియా మేకమెదడు యోచనలు చేసింది. కానీ, టీడీపీ క్యాడర్‌లోనే ఈకన్నీరు మున్నీరు కల్పిత కథలు క్లిక్‌కాలేదు. మరోవైపు ప్రజావేదిక కక్షపూరితంగా కూల్చివేతగా రంగరించిన కథనాలు, అదిగదిగో 8కోట్ల విలువ చేసే కొత్తకట్టడం కూల్చివేత అనే పచ్చచానళ్ల పైత్యం టీవీల్లో అదేపనిగా లైవ్‌చేసారు. దానికి ప్రజాస్పందన కరువాయే. అటు గుంటూరు విజయవాడ అట్టుడికి పోతాయనుకున్నారు. ప్రజావేదిక కూల్చడం అన్యాయం అని జనాలు రోడ్డు ఎక్కిపోతారనుకున్నారు. చాలామంది గుమిగూడి చోద్యం చూసారు. పైగా, అదిరా దమ్మున్న మొగోడు జగనన్న అని కూల్చివేతను కళ్లార చూస్తున్నవారు కామెంట్లు దంచారు.

బాబు ఉంటున్న ఇంటిని సీఎం జగన్‌ కూల్చేస్తే మేమున్నాం. మాఇళ్లకు వచ్చేయండి. మాస్థలం ఎంతకావాలంటే అంత ఇస్తాం, ఇల్లు కట్టుకోండని బాబు ఇంటి చుట్టుపక్కల ఉన్న  రైతాంగం పెద్దఎత్తున వచ్చి బాబుకు అండగా నిలిచారనే కల్పిత కథనాలు బాబు అనుకూల మీడియా రంగరించి వడ్డించింది. అది కూడా జనాల్లో క్లిక్‌ కాలేదు. ఇలాంటి 1982 నాటి పాత ఎత్తుబడులకు అలవాటయిన పచ్చమీడియా రాజకీయకథలకు కాలం చెల్లిందని ఈసరికే టీడీపీలో సమస్త క్యాడర్‌కు అవగతం అయ్యింది. జనాలు ఎందుకు టీడీపీనేతల తప్పిదాలపై స్పందించి రోడ్డు ఎక్కుతారు అనేది జనవాక్యం అయ్యింది. ఇంతా పచ్చమీడియా చేస్తున్నది కేవలం బాబును జనాల్లోకి వెళ్లేలా చేయడానికి సరైనదారి వెతుకులాటే. దిక్కుమాలిన కథనాలు ప్రజల్లో ఇంజక్టు చేసే ఎత్తుగడలో మిగిలారు. స్పందించని ప్రజల్లో  ఏమని ముఖం చూపాలో అర్ధంకాని పరిస్థితిలో బాబు అండ్‌కో మిగిలింది.

బాబుకు పార్టీలో ఉన్న వారెవరో ప్రజల్లోకి వెళ్లడానికి సరైనదారి చూపారు. అదే ఓట్లశాతం కుదించి గెలిపించిన కుప్పంకు పోతే, అక్కడ జనాలతీరు అవగతం అవుతుంది అని బాబు చెవికి ఎక్కించారు. ఇదేదో చూద్దామని బాబు నడుంబిగించారు. ఓటమి తరువాత కుప్పంలో అడుగెట్టారు. అక్కడ ప్రజల్లో అందరికి కాకపోయినా బాబును చూద్దామనే ఉత్కంఠ కొద్దిశాతం మందికి పెరిగింది. అధికారదర్పంతో ఎగిరెగిరిపడే బాబును అధికారం కోల్పోయాక బాబు కూతలు వినాలని ఒకింత వచ్చి గుమిగూడారు. ఓట్లుతగ్గినా గెలిపించిన మీకు రుణపడ్డాను. కుప్పంకు నీళ్లు ఇచ్చే వరకు ఇప్పుడున్న సర్కారుతో పోరుతాను. ఇక పార్టీ ఓటమికి కారకులను వేలెట్టి చూపలేను. వాటివలన పలువురు బాధపడతారని తక్కువ ప్రసంగానికి పరిమితం అయ్యారు. దీన్ని ఓపచ్చ మీడియా చాటంత భూతద్దంలో జనాలకు చూపేందుకు తన పచ్చపైత్యం జోడించింది.

బాబు మారారని కుప్పంలో తక్కువ మాటలకే పరిమితం అయ్యారని ఇదో శుభపరిణామం అనేట్టుగా ఆకథనం తయారుచేసి చంకలు గుద్దుకుంది. ఇలానే బాబు మారాడని పచ్చమీడియా పదేళ్లపాటు సాగించిన అక్షరయజ్ఞంను సరేలే మారే ఉంటాడని నమ్మిన ప్రజలు 2014లో బాబును గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా బాబు అమలు చేయలేదు. జనాలకు ఐదేళ్లపాటు చుక్కలు చూపే పాలనతో మారానంటే ఇదేనన్నట్టు కడగండ్ల పాల్జేసారు. ఏవర్గమైన మాకు అదిచేస్తాం ఇది చేస్తామన్నారు అని గుర్తుచేస్తే తోకలు కత్తిరిస్తానని బాబు గుంయ్‌మనేవారు. ఇలా ఐదేళ్లూ తనస్వంతానికి క్యాడర్‌కు దోచుకోవడం దోచిపెట్టడంలో రోజుకు 18గంటలు పన్జేసారు. ఇదంతా ప్రజల సాక్షిగా చేసారు. మూడున్నర లక్షలకోట్ల అవినీతికి బాబు అండ్‌కో పాల్పడినట్లు ప్రత్యర్ధులు నిలదీసారు. జాతీయ మీడియాలు బాబు అవినీతి ఆనకొండ అని అనేకానేక కథనాలతో తూర్పార బట్టాయి.

బాబుకు అంతా తెలుసు. తన దుర్మార్గపు పాలన గురించి తెలుసు. ప్రజలు ఎంతగా కడగండ్ల పాలయింది తెలుసు. ప్రజలెందుకు తిరస్కరించారో తెలుసు. టీడీపీ క్యాడర్‌కు తాము ఓడిపోతామని తెలుసు. అంతా తేలుకుట్టిన దొంగల్లా ఎన్నికల్లో డబ్బు ఇచ్చి గెలవచ్చు అనేదిశలో ఓటర్లను డబ్బుఎరవేసి అర్ధించారు. అందుకే ప్రజల్లోకి ఈరోజు టీడీపీ నేతలు ఎవరూ పోవడానికి నేటికి సాహసించలేకుండా ఉన్నారు. ఇలా అయితే పార్టీ చెదిరిపోతుందని బాబు కుప్పం పర్యటన చేపట్టారు. అదేమంత విజయవంతంకాలేదు. ఎన్నికల తర్వాత రెండు పార్టీల మద్య పలుజిల్లాల్లో 130 దాడులు జరిగాయి. అందులో ఐదుగురు బలయ్యారు. హతమైనవాళ్లు టీడీపీ వారే అని బాబు అండ్‌కో లెక్కలుకట్టారు. బాబు ఓడిన వెంటనే దాడులంటూ మీడియా ముందుకు రావడం ఆనవాయితీ. వాస్తవానికి పార్టీనేతల కోసమో, పార్టీకోసమో వారు దాడుల్లో బలికాలేదు. అక్కడ వారి పెత్తనాలు సాగించుకోవడంలో ఏదో ఒకపార్టీ నీడలో ఉంటారు అనేది ఆప్రాంత వాసులకు తెలుసు. బాబు ఓడినప్పుడు కొత్తసర్కారు మా కార్యకర్తలపై ప్రాణాంతకదాడులు చేస్తోందని మీడియాల్లో హోరెత్తుతారు.

పోలీసులకు ఫిర్యాదు చేయించడంలో తన పార్టీనేతలను అదేపనిగా పోలీసుల వద్దకు పంపడం ఆనవాయితీ. బాబు తీరు, నైజం అంతా జనాలకు తెలుసు. 2014లో బాబు పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చాక 25 మంది వరకు  వైకాపా కార్యకర్తలు, నేతలు హతమయ్యారు. వాటిని ఆనాడు అధికారబలంతో పట్టించుకోలేదు. పోలీసులు కేసులు కట్టకుండా బాబు అడ్డంపడ్డారు. తప్పదని కొన్నికేసులు పోలీసులు కోర్టుగుమ్మాల వరకు తీసుకుపోయారు. అధికారం కోల్పోయాక తొలి అసెంబ్లీలోనే 130 వరకు టీడీపీపై దాడులు ప్రస్తావన తెచ్చారు టీడీపీ భలో చూపారు. భార్యచేతిలో హతమైన భర్తని మేమే హతమార్చినట్లు ఆపాపం మాకు అంటగడితే ఎలా అని సభికుల నవ్వుల్లో నిజనిర్ధారణ చేసారు. బాబు జనాల్లోకి పోవడానికి క్యాడర్‌ను కాపాడుకోవాలంటే ఎప్పుడు పిలిచినా పలికేలా మీకు అన్నివిషయాల్లో అండగా ఉంటానని చెప్పడం కుప్పంలో ఆరంభించారు. ఆతర్వాత మరేచోటికి పోవడానికి దారి కానక వైసీపీ దాడుల్లో హతమైన వారి కుటుంబాలను కలుస్తానన్నారు. ఓ ఐదులక్షలు చేతిలో పెట్టి వస్తానని ఓదార్పు యాత్ర అని ఆపరామర్శకు పేరు పెట్టి శ్రీకారం చుట్టారు.

తాడిపత్రి ఏరియాలో ఓహతుని కుటుంబాన్ని పరామర్శతో బాటు 5లక్షలు ఇచ్చేసి ఏర్పాటు అయిన సభలో అండగా ఉంటా. తెలుగువారి తెలుగు ఆత్మగౌరవం కాపాడుకుందాం అని  చెప్పారు. బాధితులకు పోలీసులు తగున్యాయం చేయాలని కోరారు. ఎప్పుడు ఇలాంటివి జరిగినా వస్తానని కూడా వారికి భరోసా నిచ్చారు. అక్కడ ప్రజల్లో ఇదేం ఓదార్పు. ఆధిపత్యాల కోసం, స్థానికులు హతమైతే పార్టీకి చెందిన లోకల్‌ నాయకుడు పరామర్శించడం ఎక్కడా జరిగేదే. కానీ, దానికి ఓదార్పుయాత్ర అని పేరుపెట్టి సాక్షాత్తు చంద్రబాబే ఊడిపడడం జనాలు పెదాలు విరుస్తున్నారు. ఒకవేళ హతమైనవ్యక్తి పార్టీకి కీలకమైతే పరామర్శించవచ్చు. ఐదేం కర్మ పదిలక్షలైనా ఇవ్వవచ్చు.

నిజమైన రాజకీయహత్యలు జరిగేటప్పుడు పార్టీ మూలవిరాట్టులు లోపాయికారిగా పెద్దమొత్తాలు చెల్లిస్తుంటారు. పార్టీల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి, మృతులైన వారిని పార్టీనేతలు పరామర్శించొచ్చు. కానీ, బాబులా  ఓదార్పుయాత్ర అనే పేరుపెట్టడం సరికాదని పలువురు బాబు తీరుకు నొసలు నొక్కుకుంటున్నారు. మరోవైపు బాబు పుత్రరత్నం మాట్లాడుతూ మేము తిరగబడితే వైకాపా తిరగగలదా అని చిలకపలుకులు పలకడం మరోవిశేషం. తండ్రి కొడుకుల తీరు ఇలా జనాల్లో అభాసు పాలవుతోంది.
-యర్నాగుల సుధాకరరావు

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?