Advertisement

Advertisement


Home > Politics - Political News

అక్రమ సంబంధం కోసం ఏకంగా సొరంగం తవ్వేశాడు

అక్రమ సంబంధం కోసం ఏకంగా సొరంగం తవ్వేశాడు

కామాతురానాం న సిగ్గు, న భయం అన్నాడో కవి. దాన్ని అక్షరాలా నిజం చేశాడు ఓ ప్రబుద్ధుడు. తన అక్రమ సంబంధం కోసం ఏకంగా పెద్ద సొరంగం త్రవ్వేశాడు. తన ఇంటి నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ వరకు నేరుగా ఓ సొరంగ మార్గాన్ని నిర్మించుకున్నాడు. మెక్సికోలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మెక్సికోలో సొరంగాలు సర్వసాధారణం. అమెరికా-మెక్సికో మధ్య కొన్ని వేల రహస్య సొరంగాలు ఉన్నాయి. మెక్సికోలో నిర్మాణ రంగంలో ఉన్న చాలామందికి సొరంగాలు తవ్వడంలో అనుభవం ఉంది. ఇలాంటి అనుభవంలో పండిపోయాడు అల్బెర్టో. నిర్మాణరంగంలో పనిచేస్తున్న ఈ వ్యక్తి.. తిజునా పట్టణంలో ఉంటున్నాడు. తన ఇంటికి కొద్దిదూరంలో ఓ సెకెండ్ సెటప్ పెట్టుకున్నాడు ఈ వ్యక్తి.

అయితే తన అక్రమ సంబంధం కొనసాగించడానికి ప్రియురాలి భర్త అడ్డుగా ఉన్నాడు. ప్రేయసి భర్త లేనప్పుడు నేరుగా వెళ్దామంటే సీసీ కెమెరాలతో చిక్కొచ్చిపడింది. అందుకే ఇక లాభం లేదని గ్రహించి.. తన ఇంటి నుంచి నేరుగా ప్రియురాలు బెడ్ రూమ్ కు సొరంగం తవ్వేశాడు. ప్రియురాలి భర్త అలా డ్యూటీకి వెళ్లడం.. అల్బెర్టో ఇలా సొరంగంలోకి దూరడం కామన్ అయిపోయింది.

అయితే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు దాగవు కదా. ఓరోజు భర్త డ్యూటీ నుంచి తొందరగా ఇంటికొచ్చాడు. చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. అనుమానం వచ్చి మంచం కింద చూశాడు. అక్కడ కూడా లేరు. సోఫా ఊగుతుంటే అనుమానం వచ్చి చూడగా.. తన భార్య, అల్బెర్టో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

ఇంట్లోకి ఎలా వచ్చాడో ఆరా తీయగా.. సొరంగం విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సీక్రెట్ సొరంగం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?