cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పైశాచికం.. గొడ్డలితో కసితీరా నరికాడు

పైశాచికం.. గొడ్డలితో కసితీరా నరికాడు

అనుమానం పెనుభూతం అన్నారు. అలాంటి అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యపై విచక్షణరహితంగా దాడిచేసి చంపిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. గొడ్డలితో కసితీరా నరికి, ఆ తర్వాత అదే గొడ్డలితో మృతదేహం పక్కనే కూర్చున్న ఆ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

వెల్గటూరు మండలం చర్లపల్లికి చెందిన శంకరయ్యకు 15 ఏళ్ల కిందట సుజాతతో పెళ్లయింది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లుగా శంకరయ్య ముంబయిలో పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనేది శంకరయ్య అనుమానం. ప్రారంభంలో ఈ అనుమానాల్ని తేలిగ్గా తీసుకుంది సుజాత. కానీ శంకరయ్యలో ఆ అనుమానం పెనుభూతంగా మారింది. రోజూ పూటుగా మద్యం తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవ పడేవాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయాన్నే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. స్నానానికి బాత్రూమ్ కు వెళ్లిన సుజాత కోసం బయట గొడ్డలితో ఎదురుచూశాడు శంకరయ్య. ఆమె బయటకు రాగానే తల, మెడ, చేతులపై దారుణంగా దాడిచేశాడు. దీంతో సుజాత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిద్రలేచిన పిల్లలు దారుణాన్ని చూసి వణికిపోయారు.

భార్యను చంపిన శంకరయ్య.. గొడ్డలతో మృతదేహం పక్కనే కూర్చున్నాడు. సుజాత సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శంకరయ్యను అరెస్ట్ చేశారు. 

ఆ పేరు కూడా పలకను

దేశం మౌనం పాటిస్తోంది

 


×