cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మిస్టరీగా మారిన ఉద్యోగి ఆత్మహత్య

మిస్టరీగా మారిన ఉద్యోగి ఆత్మహత్య

శారీరకంగా తగిలిన దెబ్బలు పైకి కనిపిస్తాయి. కానీ మానసికంగా తగిలిన దెబ్బలు పైకి కనిపించవు. పైగా రోజురోజుకు అవి మరింత తీవ్రమౌతాయి. అలాంటి మానసిక సమస్యతోనే బాధపడ్డాడు వెంకటేష్. ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఫ్రెండ్ ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడీ కేసు మరింత జటిలమైంది. విశాఖలో జరిగింది ఈ దుర్ఘటన.

దివీస్ కంపెనీలోని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాడు వెంకటేష్. అతడికి సతీష్ తో పరిచయమైంది. ఇద్దరూ తక్కువ టైమ్ లోనే ఫ్రెండ్స్ గా మారారు. సతీష్ భీమిలిలోనే సుభాష్ వీధిలో ఉంటుండగా.. కృష్ణా జిల్లాకు చెందిన వెంకటేష్ మాత్రం కంపెనీ హాస్టల్ లో ఉంటున్నాడు.

భార్య పుట్టింటికి వెళ్లడంతో, వెంకటేష్ ను ఇంటికి ఆహ్వానించాడు సతీష్. సోమవారం సాయంత్రం ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మంగళవారం ఉదయం సతీష్ కు షిఫ్ట్ డ్యూటీ ఉండడంతో.. వెంకటేష్ కు చెప్పి ఆఫీస్ కు వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని తిరిగొచ్చి తలుపు కొడితే వెంకటేష్ తీయలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. వెంకటేష్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

ఊహించని విధంగా వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాత్రంతా వెంకటేష్ బాగానే ఉన్నాడని, తను ఆఫీస్ కు వెళ్లి వచ్చిన గ్యాప్ లో ఏదో జరిగిందని సతీష్ చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. 

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

 


×