cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మన్యానికి మావోల టెన్షన్ ?

మన్యానికి మావోల టెన్షన్ ?

మావోయిస్టులు లేరు, వారి కార్యకలాపాలు నిలిచిపోయాయి అని ఎవరైనా అనుకుంటే తప్పేనని నిరూపించేలా చత్తీస్ ఘడ్ దారుణ ఘటన జరిగింది. దాంతో ఇపుడు మావోల ఉనికి ఉన్న చోట్ల కొత్త టెన్షన్ పట్టుకుంది.

విశాఖ మన్యంలో తాజాగా మావోల కదలికలు మళ్లీ పెరిగాయని పోలీస్ వర్గాలకు సమాచారం అందుతోంది. అదే సమయంలో ఏవోబీ ప్రాంతం నుంచి మావోలు విశాఖ మన్యం వైపుగా లోకి ప్రవేశించారన్న వార్తలతో పోలీస్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి.

మరో వైపు చత్తీస్ ఘడ్ ఘాతుకం తరువాత మావోలు తప్పించుకోవడానికే ఈ వైపుగా వచ్చారని అంటున్నారు మరి కొన్నాళ్ళు ఇక్కడే వారు తిష్ట వేసే అవకాశాలు ఉన్నయన్న భోగట్టాలతో మన్యం మళ్లీ వణుక్తోంది. 

ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీకి చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు ఒక్కసారిగా తమ పదవులకు రాజీనామా చేశారు తమకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయని వారు ఆరోపిస్తూంటే మావోల నుంచి ఇబ్బందుకు తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. మొత్తానికి మావోల అలికిడి మన్యంలో బాగానే ఉందన్న వార్తలు మాత్రం ఏజెన్సీని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×