cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీ టూరిస్ట్ కు ఏడుపెక్కువ

ఏపీ టూరిస్ట్ కు ఏడుపెక్కువ

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు రెగ్యులర్ టూరిస్ట్ గా మారారని, పొద్దున్న ఏపీకి వచ్చి సాయంత్రానికి ఫ్లయిట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటుంటే.. బాబు చూడలేకపోతున్నారని విమర్శించారు.

"జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా జల కళ వచ్చింది. నా జిల్లా నెల్లూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుతున్నాయి. ఇది ఓ మంచి శుభ పరిణామం. కానీ ఇది చూసి కొంతమందికి బాధేస్తోంది.

ఇన్ని వర్షాలు, నీళ్లు చూసి వాళ్లకు ఏడుపొస్తోంది. వాళ్ల హయాంలో వర్షాలు లేవు, ఇప్పుడు పడేసరికి వాళ్లు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. ప్రజలు, రైతులు సంతోషంగా ఉంటే వాళ్లు చూడలేకపోతున్నారు."

ఇక చంద్రబాబు కరకట్ట నివాసంపై కూడా మంత్రి స్పందించారు. నోటీసులు ఇచ్చినా సిగ్గులేకుండా ఇల్లు ఖాళీ చేయకుండా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని కామెంట్ చేశారు. నీళ్లలో ఇల్లు కట్టి మునిగిపోతుందని ఏడిస్తే ఎలా అని ప్రశ్నించారు అనీల్.

"చంద్రబాబు కరకట్ట మీద ఉండడమే తప్పు. ఇప్పటికే 4-5 సార్లు నోటీసులిచ్చాం. సిగ్గులేకుండా ఇంకా అక్కడే ఉన్నారు. సరిగ్గా వరదలొచ్చే టైమ్ కు నా ఇల్లు ముంచుతున్నారని రాద్దాంతం చేస్తారు. ఎలాగూ ఆయన పత్రికలున్నాయి. బాబు తానా అంటే అవి తందానా అంటాయి. చంద్రబాబు ఇల్లు ముంచబోతున్నారని వాళ్లు ముందే రాసేస్తారు."

రెండున్నర నెలల నుంచి బ్యారేజీకి ఇన్ ఫ్లో ఉందని... ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని అన్నారు అనీల్. ఓవైపు ఇంత జరుగుతుంటే ఆయన మాత్రం ఇల్లు ఖాళీ చేయకుండా పైపెచ్చు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ గుర్తించాలి

 


×