Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలుసుకో పవన్ అంటూ మంత్రి గారు....

తెలుసుకో పవన్ అంటూ మంత్రి గారు....

సినీ నటుడు కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ ఇపుడు లేటెస్ట్ గా మత్స్యకారుల ఇష్యూని టేకప్ చేసింది. ఏపీలో మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిపోతోంది అని పవన్ కళ్యాణ్ కుడిభుజం నాదెండ్ల మనోహర్ కాకినాడ టూర్ లో ఆవేదన చెందారు. ఏపీలో మత్స్య కారుల స్థితిగతులు ఏ మాత్రం బాగు లేవని, పవన్ సీఎం అయ్యాక వారి సమస్యలు అన్నీ పరిష్కరిస్తారని కూడా మనోహర్ చెప్పుకొచ్చారు.

మరో వైపు చూస్తే వచ్చే వారం కేవలం మత్స్యకారుల సమస్యల మీద నర్సాపురంలో పవన్ ఒక ఆందోళన కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. దాంతో మత్స్య శాఖను చూస్తున్న మంత్రి సీదరి అప్పలరాజు లైన్ లోకి వచ్చారు. అసలు పవన్ కి ఏపీలో మత్య్సకారులకు తమ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా అంటూ బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు.

ముందు తెలుసుకో పవన్ అంటూ మంత్రి గారు తాము మత్స్యకారులకు ఏం చేస్తున్నదీ బాగానే వివరించారు. ఏకంగా ఏపీలో  32 వేల ఇళ్ళను వారికి కట్టిస్తున్నామని, ఏపీలో నాలుగు చోట్ల ఫిషింగ్ హార్బర్లు తమ ప్రభుత్వం నిర్మిస్తోందని, వేసవిలో వేట ఆపేసిన రోజులలో మత్స్యకారుల ప్రతీ  బోటుకు పది వేలు ఇవ్వడమే కాకుండా డీజిల్ కూడా సబ్సిడీ మీద ఇస్తున్నామని తెలియచేశారు.

చేపలను ఆరోగ్యకరమైన వాతావరణంలో అమ్ముకోవడానికి ఏపీలో అన్ని చోట్లా కూడా  ఫిషింగ్ అవుట్ లెట్స్ ని కూడా నిర్మించి వారికి మార్కెటింగ్ సదుపాయలను తమ సర్కార్  కల్పిస్తోందని మంత్రి చెప్పారు. ఇలా వారికి ఎన్నో పధకాలను తమ ప్రభుత్వం చేస్తూంటే పవన్ కి కనిపించవా అని గుస్సా అయ్యారు.

తోలు తీస్తాను, ఫినిష్ చేస్తాను అని గతంలో చంద్రబాబు వారిని గద్దించినపుడు పవన్ ఏమయ్యారు అని కూడా మంత్రి మండిపడ్డారు. కేవలం టీడీపీని బలోపేతం చేయడానికే పవన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారని కూడా మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. తన వెంట వస్తే పవన్ కి ఏపీలో జరిగే మేలు ఏంటో తెలుస్తుందని, అలా కాకుండా ఆయన రాజకీయ అజెండాతో ఆందోళనలు చేసుకుంటే తాము  ఏం చేయలేమని కూడా అనేశారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వస్తున్నారు, అది కూడా గంగపుత్రుల ఇష్యూ మీద గొంతు విప్పబోతున్నారు. మరి వారికి ప్రభుత్వం చేసిన మేలు ఆయనకు తెలియదనుకోవాలా. లేక చేసిన మేలు చాలదనుకొవాలా. ఏది ఏమైనా పవన్ ఈసారి గంగపుత్రుల ఇష్యూతో ఏపీలో ఆందోళనకు రెడీ అవుతూంటే మళ్ళీ వైసీపీ వర్సెస్ పవన్ గా హాట్ హాట్ పాలిటిక్స్ కి తెరెలేవనుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?