Advertisement

Advertisement


Home > Politics - Political News

రాంగ్ టైమ్ లో ఏపీ ప్రజల్ని కెలికిన మోడీ

రాంగ్ టైమ్ లో ఏపీ ప్రజల్ని కెలికిన మోడీ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అంటే సమైక్యాంధ్ర విడిపోయిన రోజు.. ఈరోజు తెలంగాణకు పండగేమో కానీ, విభజిత-బాధిత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం అది కచ్చితంగా పీడకలగా మిగిలిపోయిన రోజు. జూన్-2 తెలంగాణలో సంబరాలు జరుగుతాయి, ఏపీ ప్రజలు మాత్రం దాన్ని ప్రత్యేకంగా గుర్తించట్లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే నవంబర్ 1 మాత్రమే. అలాంటి టైమ్ లో మోడీ తెలంగాణకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు, చెప్పారు.

పనిలో పనిగా ఏపీ పై కూడా అచ్చ తెలుగులో ఓ ట్వీట్ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.. అని అంటూ.. కృషి, పట్టుదల, సంస్కృతికి మారుపేరు ఏపీ అని, దేశ పురోభివృద్ధిలో ఏపీ భూమిక ఎంతో గణనీయమైనది అని అంటూ, ఏపీ ప్రజల అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నానని ట్వీటారు. ఇక చూస్కోండి.. ఏపీ ప్రజలకు ఎక్కడో కాలింది.

రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ దే అయినా, ఆ తర్వాత ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజల్ని దారుణంగా మోసం చేసింది మాత్రం కచ్చితంగా బీజేపీనే. అమరావతి శంకుస్థాపన రోజు కూడా పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు తీసుకొచ్చారు కానీ ప్రత్యేక హోదా పై మాటేలేదు. ఏపీని అన్నివిధాలా మోసం చేసిన మోడీ ఇప్పుడు కృషి, పట్టుదల, విజయవంతం అంటూ.. ట్వీట్ వేస్తే ఎవరికి మాత్రం కాలదు చెప్పండి. అందుకే ప్రధాని శుభాకాంక్షల సందేశానికి రిటర్న్ గిఫ్ట్ గా బండబూతులు వచ్చాయి.

ప్రత్యేక హోదా సంగతేంటని కొందరు ప్రశ్నిస్తే, భవిష్యత్తులో నీకు ఏపీ ఎంపీల అవసరం రాకూడదని ప్రార్థించుకో అని మరొకరు చురకలంటించారు. ఇంకొందరు కాస్త ఇబ్బంది కలిగించే భాషలో చెడుగుడు ఆడుకున్నారు. పనిలో పనిగా బీజేపీతో అంటకాగి, కేంద్రంలో మంత్రి పదవులు పొంది, రాష్ట్రంలో బీజేపీ నేతలకి మంత్రి పదవుల తాయిలాలిచ్చి రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబుని కూడా మోడీ తిట్టించారు.

అయితే అంతలోనే బీజేపీ బ్యాచ్ రంగంలోకి దిగి.. మోడీ శుభాకాంక్షలకు దన్యవాదాలు చెబుతూ రిప్లైలు ఇచ్చారు. కాస్త కవర్ చేశారు. మొత్తమ్మీద రాంగ్ టైమ్ లో ఏపీ ప్రజల్ని కెలికి మరోసారి ప్రత్యేక హోదా విషయంలో తిట్టించుకున్నారు ప్రధాని మోడీ. 

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?