cloudfront

Advertisement


Home > Politics - Political News

మోహన్‌బాబు వైసీపీ జెండా పట్టుకోవాల్సిందే.!

మోహన్‌బాబు వైసీపీ జెండా పట్టుకోవాల్సిందే.!

తెలుగుదేశం పార్టీ ఊరుకునేలా లేదు.. సినీనటుడు మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా పట్టుకోవాల్సిందేనేమో.! నిజానికి వైఎస్సార్సీపీ జెండా పట్టుకోవాలని మోహన్‌బాబు అనుకుంటే, ఆయన ఆగే మనిషి కానే కాదు. మోహన్‌బాబు అడిగితే ఎమ్మెల్యే టిక్కెట్టో, ఎంపీ టిక్కెట్టో ఇవ్వడానికి వైఎస్‌ జగన్‌ వెనుకడుగు వేసే ప్రసక్తి కూడా వుండదు. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో రాజ్యసభకు మోహన్‌బాబు ఎంపికైనా, స్వర్గీయ ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయినా.. అన్ని రాజకీయ పార్టీలతోనూ మోహన్‌బాబుకి సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇక, తన విద్యాసంస్థలకు సంబంధించి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ బకాయిల కోసం మోహన్‌బాబు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఆ బకాయిల సంగతి ప్రభుత్వం తేల్చేస్తే, అసలు సమస్యే వుండేదికాదు. చాలావరకు ఇచ్చేశాం, ఇవ్వాల్సింది చాలా తక్కువ.. అని ప్రభుత్వం చెబుతోంది. కాదు కాదు, చాలా బకాయిలు పడ్డారనీ, తనను చంద్రబాబు మోసం చేశారనీ మోహన్‌బాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తన చాణక్యం ఉపయోగించి ఆల్రెడీ, కుటుంబరావుని మోహన్‌బాబుపైకి ఉసిగొల్పిన విషయం విదితమే.

'చెయ్యాలనుకుంటే డైరెక్ట్‌గా రాజకీయాలు చేయండి.. మోహన్ బాబు రాజకీయాల్లోనూ చాలా బాగా నటిస్తున్నారు..' అంటూ కుటుంబరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌ లాంటి టీడీపీ నేతలు వ్యాఖ్యానించడమంటే ఖచ్చితంగా మోహన్‌బాబుని రెచ్చగొట్టడం కిందనే భావించాలి. చంద్రబాబు గురించి అణువణువూ తెలిసిన అతి కొద్దిమందిలో మోహన్‌బాబు కూడా ఒకరు. మోహన్‌బాబు చాలా సందర్భాల్లో చంద్రబాబు గురించి ఇలా ప్రస్తావించి, అలా ఆగిపోయేవారు. 'ఇది వేదికకాదు, నేను మాట్లాడకూడదు..' అని సంయమనం పాటించారాయన.

కానీ, ఇప్పుడు మోహన్‌బాబు అలా ఆగేందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు.. అంతలా చంద్రబాబు, మోహన్‌బాబుని రెచ్చగొడ్తున్నారు. అదేంటో, చంద్రబాబుకి తిట్టించుకోవడమంటే అంతసరదా.! నిజానికి ఇది సరదా కాదు.. 'నా మీద అందరూ కలిసి దాడిచేస్తున్నారు...' అంటూ ఆ తర్వాత సానుభూతి పొందేందుకే.. ఈ జిత్తులమారి వేషాలన్నది చంద్రబాబు గురించి బాగా తెలిసినవారు చెప్పేమాట.  

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా