Advertisement

Advertisement


Home > Politics - Political News

తప్పు ఎవరిది: సైకో కొడుకున కడతేర్చిన తల్లి

తప్పు ఎవరిది: సైకో కొడుకున కడతేర్చిన తల్లి

అన్ని క్రైమ్స్ ను ఒకే గాటన కట్టి చూడకూడదు. దీనికి ప్రత్యక్ష  ఉదాహరణగా నిలిచింది ఒంగోలులో జరిగిన ఓ హత్య కేసు. తన పట్ల దుర్మార్గంగా వ్యవహరించి, లైంగికంగా వేధిస్తున్న కొడుకును స్వయంగా కన్నతల్లి మట్టుబెట్టింది. సుపారీ ఇచ్చి మరీ చంపించింది. ఈ కేసులో తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొడుకుది తప్పా.. లేక కొడుకును చంపించిన తల్లిది నేరమా..?

జిల్లాలోని పొన్నలూరుకు చెందిన నరసింహారావుకు 15 ఏళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త అకృత్యాల్ని భరించలేక, అతడ్ని వదిలేసి పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది భార్య. అక్కడే కూలిపనులు చేసుకుంటూ జీవిస్తోంది.

ఇంట్లో భార్య లేక కామంతో రగిలిపోతున్న నరసింహారావు, తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. హైదరాబాద్ వెళ్లి భార్యను తీసుకురావాలని లేకపోతే తన కోరిక తీర్చాలని తల్లిని హింసించాడు. దీంతో విసుగెత్తిన ఆ తల్లి, కన్నకొడుకును కడతేర్చాలని నిర్ణయించుకుంది.

తన గోడును సోదరుడితో చెప్పుకుంది. ఇద్దరూ కలిసి మరికొంతమంది వ్యక్తులకు లక్షా 70వేల రూపాయల సుపారి ఇచ్చి నరసింహరావును చంపించారు. కందుకూరు వెంకటాద్రి నగర్ పార్క్ కు వెళ్లే దారిలో నరసింహారావును చంపేసి, అక్కడే గుంతతీసి పూడ్చిపెట్టారు. ఈ కేసును సీక్రెట్ గా దర్యాప్తు చేసిన ఒంగోలు పోలీసులు నరసింహరావు తల్లిని, ఆమె సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఈనాడు పాలిష్డ్, జ్యోతి బరితెగింపు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?