Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసేవాళ్లని సోషల్ మీడియాలో బతకనీయరు. విపరీతంగా ట్రోలింగ్ చేసి వదిలిపెడుతుంటారు. స్వయానా పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా పవన్ వీరాభిమానుల బాధితురాలే. ఇక పవన్ కల్యాణ్ ని నేరుగా విమర్శించినా, సోషల్ మీడియాలో విమర్శించాలని చూసినా.. భజనసైనికులు వారిని ఓ పట్టాన వదిలిపెట్టరు.

వీరికి నాయకత్వం వహిస్తూ ముందుగా మెగా బ్రదర్ రంగంలోకి దిగుతుంటారు. తాజాగా.. ప్రకాష్ రాజ్ విషయంలో కూడా అభిమానుల్లో ఆవేశాన్ని రగిలించే ప్రయత్నం చేశారు నాగబాబు. పనిలో పనిగా ప్రకాష్ రాజ్ వృత్తిగత జీవితాన్ని కూడా విమర్శించారు.

"నిర్మాతల్ని ఎన్నిరకాలుగా డబ్బు కోసం హింస పెట్టావో, ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి ఎంత హింసకు గురి చేశావో ఇంకా గుర్తున్నాయి. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతల్ని కాల్చుకు తిన్న నువ్వు ముందు మంచి మనిషిగా మారు." ఇవీ ప్రకాష్ రాజ్ సినీ కెరీర్ ని ప్రభావితం చేసేలా నాగబాబు మాట్లాడిన మాటలు.

అసలు ప్రకాష్ రాజ్ ఏమైనా పవన్ కల్యాణ్ సినిమా కెరీర్ గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ మాట్లాడారా? కేవలం పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, రాజకీయ అవకాశవాదం గురించే ప్రకాష్ రాజ్ నోరు తెరిచారు.

అంతమాత్రానికే నాగబాబు ఇంతగా గింజుకోవడం దేనికి? గతంలో ఎవరైనా పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే.. పర్సనల్ లైఫ్ తో మీకెందుకు అంటూ రెచ్చిపోయేవారు నాగబాబు అండ్ కో.

మరిప్పుడు ప్రకాష్ రాజ్ రాజకీయంగా చేసిన విమర్శలను రాజకీయంగానే తిప్పికొట్టాల్సింది పోయి.. 'నువ్వు నిర్మాతల్ని కాల్చుకుతిన్నావ్' అంటూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్.

అంత కాల్చుకు తినే మనిషే అయితే.. గతంలో గోవిందుడు అందరివాడే సినిమాలో రాజ్ కిరణ్ పాత్రను సగంలో లేపేసి ప్రకాష్ రాజ్ ని ఎందుకు తీసుకున్నారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ప్రకాష్ రాజ్ తో ఎందుకు సినిమాలు చేస్తున్నారు? అంత కాల్చుకుతినేవాడిని నిర్మాతల మండలి ఎందుకు దూరం పెట్టలేకపోయింది.

తప్పులు చేసినా తమకి అనుకూలంగా భజన చేసేవాళ్లే తమ వాళ్లు, ఆ తప్పుల్ని ఎత్తి చూపిన వాళ్లంతా స్వార్థపరులు, హింసించేవాళ్లు.. ఇదే నాగబాబు ఫిలాసఫీలా కనిపిస్తోంది. విమర్శల్ని స్వాగతించలేని మనస్తత్వం ఉన్నన్ని రోజులు జనసేన బాగుపడదు, బాగుపడనివ్వరు.

పవన్ కు కానరాని మద్దతు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?