cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అవంతి మీద పడ్డారు !

అవంతి మీద పడ్డారు !

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రముఖుడుగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం ద్వారా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి భీమునిపట్నం నుంచి పోటీ చేసి మొదటి దఫాలోనే మంచి మెజారిటీతో గెలవడంలో ఆయన పాత్రను కాదనలేం.

ఇక ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీల దాకా సాగింది. ఈ క్రమంలో ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీ అయ్యారు. ఇపుడు మంత్రిగా కొనసాగుతున్నారు. అవంతి శ్రీనివాసరావు దగ్గర లేనిది అవినీతి. పైగాఆయన మంచిగా పనిచేస్తారు, ప్రజలకు చేరువలో ఉంటారు.

అందుకే ఆయన పదే పదే గెలుస్తున్నారు. అయితే ఆయన మీద తాజాగా మెగా బ్రదర్ నాగేంద్రబాబు చేసిన ట్వీట్ ఇపుడు సెగలు పుట్టిస్తోంది. అన్ని పశువులూ గడ్డి తినవు శ్రీనూ అంటూ నాగబాబు చేసిన ఈ ట్వీట్లో అవంతిని టార్గెట్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అవంతి మీద ఇలాగే విమర్శలు చేసేవారు.

ఇక్కడో విషయం చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పార్టీ నుంచి రాజకీయంగా శ్రీకారం చుట్టినా అవంతిలో టాలెంట్ లేకపోతే ఈ రోజు మంత్రి దాకా వచ్చేవారు కాదన్నది అందరికీ తెలిసిందే. ఇక ఆయన రాజకీయాల్లో ముందుకు పోవడం, మంత్రి కావడం వంటివి చూసి ఎవరైనా  సంతోషించాలే కానీ అసూయతో కూడిన విమర్శలు చేయకూడదు.

అవంతి, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఈ ముగ్గురూ ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. జగన్ సర్కార్ లో ఇపుడు కీలక శాఖలు చూస్తున్న మంత్రులు. వీరి తమకు అండగా ఉండలేదన్న బాధ ఏదైనా నాగబాబులో ఉందేమో అందుకే ఆయన ముందుగా అవంతిని టార్గెట్ చేసి ఇలా ట్వీట్ పెట్టారని అంటున్నారు. మరి అవంతి దీనికి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ న్యూస్