cloudfront

Advertisement


Home > Politics - Political News

జగన్ తో నాగార్జున భేటీ.. 'మర్యాదపూర్వకమేనా'?

జగన్ తో నాగార్జున భేటీ.. 'మర్యాదపూర్వకమేనా'?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఒకవైపు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు సమావేశం అవుతుండగా.. మరోవైపు ‘మర్యాదపూర్వకమైన’ భేటీలు కూడా సాగుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేతతో స్టార్ హీరో నాగార్జున సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది.

జగన్ నివాసానికి వెళ్లిన నాగార్జున దాదాపు అరగంట సేపు సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా ఏ విషయం గురించి చర్చించారనే అంశంపై స్పష్టతలేదు. జగన్ తో సమావేశం అనంతరం నాగార్జున  మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. 

కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ తో నాగార్జున సమావేశం అయినట్టుగా చెబుతున్నారు. మరోవైపు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి ఊహాగానాలు మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చే ఆసక్తి నాగార్జునకు ఉందా? అనేది అనుమానమే. 

ఇటీవలే నటుడు మంచు విష్ణు కూడా సతీసమేతంగా వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. అయితే విష్ణు భార్య జగన్ కు ఎలాగూ చిన్నాన్న కూతురే కాబట్టి.. అందులో రాజకీయ ప్రసక్తి ఉండకపోవచ్చు. ఇక నిన్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ తో భేటీ అయ్యారు. అది కూడా ‘మర్యాదపూర్వకమే’ అనేమాట వినిపించింది.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?