Advertisement

Advertisement


Home > Politics - Political News

నాన్న పులి - నాన్నా పులి

నాన్న పులి - నాన్నా పులి

పప్పబ్బాయి లోకేశం పరిస్థితి ఇదే. జన్మతః వచ్చిన చిల్లర బుద్దులతో చంద్రబాబు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఎంతోకొంత ఏవో కొన్ని చేశాడు. అప్పుడున్న రాజకీయ పరిస్థులలో గుజ్రాల్, దేవగౌడ లాంటి వారు ప్రధాన  మంత్రులుగా అవ్వడానికి తనకున్న మీడియా ద్వారా, జాతీయ మీడియాను కొనడం ద్వారా వచ్చిన పెద్ద మేధావి నాయకుడనే ఇమేజ్ వలన ఈయన బొక్కలు తెలీని జాతీయ నాయకులు చంద్రబాబు పెద్ద పుడింగని తన మాటకు విలువిచ్చిన విషయం వాస్తవం. ఎవరిని ఎక్కడ ఎలా కొనాలో దేనితో కొట్టాలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి చంద్రబాబు.

జాతి మీడియా ఎలానూ ఉంది, జాతీయ మీడియాను దాన్ని నియంత్రించే వాళ్ళను తన డ్రాయింగ్ రూంలో స్కెచ్ వేసి మరీ వశపరచుకున్న వ్యక్తి చంద్రబాబు. డబ్బు, అధికారం, వ్యవస్థలలో తన మనుషులను - ఒకటేమిటి అన్ని మార్గాలలో తను ఒక అపర చాణక్యుడు, మేధావి, అనే భావన దేశ ప్రజలలో, ఫక్తు రాజకీయ నాయకులలో, జాతీయ పార్టీలలో కలిగించిన వ్యక్తి చంద్రబాబు. దేశ రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంద్రబాబును తట్టుకోలేం అని నిర్ణయానికి వచ్చారు.

కానీ ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే చంద్రబాబు మాయాజాలాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని వినూత్న రాజకీయ ఎత్తుగడలతో 2004, 2009లలో చిత్తుచేసారు. 2019లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఎంతుందో చంద్రబాబు ఘోర తప్పిదాలు తెలుగుదేశం నాయకుల అరాచకాలు అంతుండి చంద్రబాబు ఘోర పరాజయానికి కారణాలు అయ్యాయి. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ కావడానికి కూడా చంద్రబాబు ప్రమేయం తప్పకుండా ఉంది. నాటి రాజకీయ పరిస్థుతులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఒక్క కలాం గారే. దీన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నాడు.

కానీ కాలక్రమేపీ ప్రతిదానికీ చిన్నదైనా పెద్దదైనా నేనే నేనే అని క్రెడిట్ తీసుకోవడంలో అత్యుత్సాహం చూపించడంలో చంద్రబాబు పూర్తిగా పలచన అయిపోయారు. ఐటీ కంప్యూటర్లు సెల్ ఫోన్లు డ్వాక్రా సంఘాలు అన్నీ తనే కనిపెట్టానని, దేశం ఏ రంగంలో ముందడుగు వేసినా తను ఎప్పుడో పునాదిరాయి వేసానని, సత్యా నాదెళ్లను సాఫ్టువేర్ నేర్చుకోమని సింధూను తనే బ్యాడ్మింటన్ నేర్చుకోమని చెప్పాననే చిల్లర ప్రచారం చంద్రబాబును ఒక మతి గతి తప్పిన వ్యక్తిగా సమాజం ముందు నిలబెట్టాయి. దీనికి ఆయన పక్కనే ఉండి సలహాలు సూచనలిచ్చిన రాధాకృష్ణ, రవిప్రకాష్, సోమిరెడ్డి, వర్ల రామయ్య లాంటి వాళ్ళను తప్పుబట్టాలేమో.

కానీ చివరికి చంద్రబాబు మాత్రం తన క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతీసుకుని, ఘోర పరాజయం పాలై ఒక రాజకీయ అఘోరాలా నిలవడానికి చంద్రబాబు చేసిన నేలవిడిచి సాము. మాటలు కోటలు దాటుతాయి కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడవు. అమరావతి నిర్మాణం ఒక ప్రత్యక్ష సాక్షి. తన బినామీలతో వందిమాగుదులతో ప్రత్యేక విమానంలో ఏ దేశం పోయినా ఏ నగరాన్ని చూసినా అమరావతిని అంతకంటే గొప్పగా నిర్మిస్తానని ఐకానిక్ బ్రిడ్జని లండన్ క్లాక్ టవరని, అండర్ గ్రౌండ్ లూపని, బుల్లెట్ ట్రైనని, ఒలంపిక్సని ఒకటేమిటి ఎన్ని అబద్ధాలు ఎన్ని స్వప్నాలు చూపించాలో అన్నీ చూపించాడు చంద్రబాబు.

రాష్ట్ర ప్రజల్లో ఏమాత్రం ఆశలు లేని పరిస్థితి నుండి స్వర్గమే హద్దుగా చంద్రబాబు చూపించిన స్వప్నాలే ఆయనకు గుదిబండలయ్యాయి. ఒకటికి పదిసార్లు 15 లక్షల కోట్ల ఎమ్వోయూలని, సింగపూరని, ఇంద్రప్రస్థం అనీ ఆశలు రేపి, తను తన అనుచరుల దుర్మార్గపు ధనాపేక్షతో కనీస పరిపాలన ఇవ్వలేకపోవడం నాన్నా పులి సామెతను గుర్తుకుతెస్తాయి. జాతి మీడియా, డబ్బు సంచులతో కొనబడిన జాతీయ మీడియాపైన ప్రజల్లో నమ్మకం ఉన్నంతకాలం చంద్రబాబుకి హద్దే లేదు. దాన్ని నియంత్రించింది ఒక్క వైఎస్సార్ మాత్రమే.

దీనికి ఆయన 30 ఏళ్ల ప్రజాపక్ష రాజకీయం తోబాటు ఈ వైఎస్సార్ ఈ కాంగ్రెస్ పార్టీ నన్నేమీ చెయ్యలేరనే చంద్రబాబు అహంకారం కూడా కారణం అయింది. 2019లో చంద్రబాబు ఘోర పరాజయానికి వైఎస్సార్ గారికి కలిసొచ్చిన ఆ రెండు కారణాలతోబాటు సోషల్ మీడియా కూడా ఒక ప్రధాన కారణం అయింది. ముఖ్యంగా "చంద్రబాబు మొన్న నిన్న నేడు" అనే వీడియోలు చంద్రబాబు డొల్లతనాన్ని ఈ డిజిటల్ మీడియా యుగంలో బట్టలిప్పి బజార్లో నిలబెట్టి ఆయనను అనునిత్యం సమర్థించే వీర విధేయులు కూడా సమర్ధించలేని పరిస్థితిని తెచ్చిపెట్టాయి.

తన రాష్ట్రంలో గెలిచినప్పుడే ఢిల్లీలో ఎవరైనా విలువిస్తారు. జాతి మీడియా జాతీయ మీడియా ఎన్ని జాకీలు వేసినా పడుతున్న విగ్రహాన్ని నిలువరించలేరు. మొత్తానికి లోకేశం వాళ్ళ నాన్న ఒకప్పుడు పులని చెప్పే విషయం ఆనాటి మెనేజుడ్ మీడియా వలన సాధ్యపడింది. నేడు కాదు - సోషల్ మీడియా డొక్కచించి డోల్ కడుతుంది. చంద్రబాబు, లోకేశ్, తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లుగా తిమ్మిని బమ్మి చెయ్యడానికి ప్రయత్నిస్తే సోషల్ మీడియా అడ్డుకట్ట వేసింది. విచిత్రం ఏమిటంటే వాళ్ళు పాత పంథాను మార్చకపోవడం.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?