cloudfront

Advertisement


Home > Politics - Political News

అప్పుడే 'చీకటి దినం' అనేసిన లోకేష్!

అప్పుడే 'చీకటి దినం' అనేసిన లోకేష్!

అప్పుడే ఇంత పెద్ద పదాలు ఉపయోగిస్తే ఎలా లోకేష్ బాబూ.. ఇలాంటి పదాలను అలానే పెట్టుకోవాలి. ఒక్కసారి తమరి పార్టీ ప్రతిపక్షంలో పడితే, అప్పుడు పార్టీని నడిపించాల్సిన బాధ్యత మీద పడితే.. అప్పుడు.. అప్పుడు... అధికార పక్షం నుంచి వచ్చే సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ఉపయోగించడానికి ఇలాంటి పదాలు చాలానే అవసరం! అప్పుడు  కావాలంటే ఇలాంటి పదాలు ప్రయోగించు.. అని నారాలోకేష్ కు హితబోధ చేస్తూ ఉన్నారు పరిశీలకులు!

ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కాబోతున్న తరుణంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బాబు ఈ రోజును 'చీకటి దినం'గా తేల్చేశారు! ఎందుకు అలా అంటే.. ఎన్నికల కమిషన్ వీరి డిమాండ్ కు ఒప్పుకోలేదట. అందుకే ఇది ప్రజాస్వామ్యానికి చీకటిదినం అని లోకేష్ సెలవిచ్చారు.

అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చంద్రబాబు అయినా మాట్లాడాలి, ఆయన తనయుడుగా లోకేష్ అయినా మాట్లాడాలి! ఇంతకుమించి ఎవరికీ ఆ అర్హతే లేదు! ఐదేళ్లుగా వీరు ప్రజాస్వామ్యానికి చేసిన సత్కారాలు ఎన్నో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి వీళ్లే మాట్లాడాలి.

ఎన్నికల కమిషన్ ను వీరు కోరిన తాజా కోరిక ఏమిటంటే.. లెక్కించే ఐదు వీవీ ప్యాట్ లకు సంబంధించి ముందుగా స్లిప్పులను ఎంచాలట! ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కబెట్టాలట. ఏదో ఒక పేచీ పెట్టే ఉద్దేశం తప్ప ఈ డిమాండ్లో ఉన్న సత్తా ఏమిటో అందరికీ అర్థం అవుతున్నదే.

ముందుగా ఈవీఎంలలో ఓట్లను లెక్కపెడితే, ఏమిటీ వీవీ ప్యాట్ లను లెక్కిస్తే ఏమిటి.. ఏది ముందుచేసినా, ఏది తర్వాత చేసినా కౌంటింగ్ ఏజెంట్ల ముందే కదా అంతా జరిగేది!  అలాంటప్పుడు ఇలా గోలచేయడం ఎందుకో చంద్రబాబుకు, లోకేష్ కే తెలియాలి.

ఇన్నిరోజులూ యాభైశాతం వీవీ ప్యాట్ లను లెక్కపెట్టాలంటూ ఈసీ మీద విరుచుపడ్డారు. సుప్రీంకోర్టు స్థాయిలో ఆ విషయంలో ఎదురుదెబ్బలు పడేసరికి, అది వదిలిపెట్టి ఇది పట్టుకున్నారు. ఇలా ఏదో ఒక పేచీ పెట్టుకోనిది చంద్రబాబుకు పొద్దు పోయేలాలేదు. ఈ విషయంలో తండ్రిని మించి రియాక్ట్ అయిపోయి లోకేష్ బాబు ఏకంగా 'చీకటి దినం' అనేశారు. మరీ తొందరపడేస్తున్నట్టుగా ఉన్నారీయన.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం