cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో ఆ మంత్రిత్వ శాఖ ఎవ్వరికీ కలిసిరాదా?

తెలంగాణలో ఆ మంత్రిత్వ శాఖ ఎవ్వరికీ కలిసిరాదా?

సెంటిమెంట్ ఎక్కడైనా సెంటిమెంటే. అది సినీరంగం కావొచ్చు, రాజకీయ రంగం కావొచ్చు. నెగెటివ్ సెంటిమెంట్ పడిందంటే ఎవ్వరైనా వెనక్కి తగ్గాల్సిందే. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ లో కూడా ఓ మంత్రిత్వ శాఖపై అలాంటి నెగెటివ్ సెంటిమెంట్ పడింది. అదే వైద్యారోగ్య శాఖ.

తెలంగాణ ఏర్పాటైనప్పట్నుంచి ఇప్పటివరకు ఈ శాఖలో ఫుల్ టైమ్ పనిచేసిన మంత్రి లేడు. ముందుగా రాజయ్యనే తీసుకుందాం. తెలంగాణ సాధించుకొని, తొలిసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, తన కేబినెట్ లో రాజయ్యకు స్థానం కల్పించారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు వైద్యారోగ్య శాఖను కేటాయించారు.

అయితే తన పదవిని రాజయ్య ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. పైకి చెప్పలేని కొన్ని కారణాల వల్ల రాజయ్య తన మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అలా వైద్యారోగ్య శాఖను అర్థాంతరంగా కోల్పోవాల్సి వచ్చింది రాజయ్య.

సేమ్ సీన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అయింది. ఈసారి ఈటల వంతు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా, సీనియర్ నేతగా కొనసాగుతున్న ఈటలపై వేటు పడింది. అస్సైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఈటలను ఏకంగా బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్.

అటు రాజయ్య, ఇటు ఈటల ఇద్దరూ వైద్యారోగ్య శాఖ మంత్రులుగానే తమ పదవులు కోల్పోయారు. కారణాలు ఏమైనా వీళ్లు అర్థాంతరంగానే తమ మంత్రి పదవుల్ని చాలించారనేది కఠోర వాస్తవం. దీంతో ఇప్పుడీ మంత్రిత్వ శాఖపై నెగెటివ్ సెంటిమెంట్ పడింది. భవిష్యత్తులో ఈ పోస్ట్ ఇస్తామన్నా కూడా వద్దంటూ నేతలు తప్పించుకుంటారేమో.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×