cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబును ఓ ఆట ఆడుకుంటున్న‌ నెటిజ‌న్లు

బాబును ఓ ఆట ఆడుకుంటున్న‌ నెటిజ‌న్లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఏ మాత్రం  ముందూ వెనుకా ఆలోచించ‌కుండా మాట్లాడ్డంలో ముందు వ‌రుస‌లో ఉంటారు. అందుకే ఆయ‌న త‌ర‌చుగా సోష‌ల్ మీడియాకు అస్త్రాల‌ను అందిస్తూ ట్రోలింగ్‌కు గురి అవుతుంటారు. అయినా ఆయ‌న వైఖ‌రిలో ఏ మాత్రం మార్పురావ‌డం లేదు.

తాజాగా మ‌రోసారి ఆయ‌న నెటిజ‌న్ల చేతికి చిక్కారు. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబును ఉతికి ఆరేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు స్పందించారు. న్యాయ‌మూర్తులు మారినంత మాత్రాన న్యాయం మార‌ద‌ని బాబు అన్నారు.

ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు అనవసరం అనే రీతిలో వ్యవహరించిందని విమ‌ర్శించారు. రానున్న రోజుల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను కూడా వైసీపీ నేతలు వద్దంటారేమో అని  ఎద్దేవా చేశారు.  టీడీపీ నేత క‌ళా వెంక‌ట్రావు అరెస్ట్‌పై బాబు మండిప‌డ్డారు. ఆంధ్రాలో అమ‌ల‌య్యేది ఇండియ‌న్ పీన‌ల్ కోడా?  లేక జగన్‌ పీనల్‌ కోడా? అని ప్రశ్నించారు.

ప‌నిలో ప‌నిగా అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఏపీ రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు ముడిపెడుతూ విమ‌ర్శ‌లు చేశారు. అమెరికాలో సైకో ఉన్మాది ట్రంప్‌ ఇలానే చేస్తే ఇంటికి సాగనంపారని బాబు గుర్తు చేశారు. ఈ మాటే నెటిజ‌న్ల‌కు అస్త్రాన్ని అందించిన‌ట్టైంది.

మ‌రి త‌మ‌రిని ఏపీ ప్ర‌జ‌ల‌కు ఘోరంగా ఓడించి, ఇంటికి ఎందుకు సాగ‌నంపారో చెప్పాల‌ని నెటిజ‌న్లు పంచ్‌లు విసురుతున్నారు. ట్రంప్ కంటే త‌మ‌రే ఎక్కువ సైకో అని, అందువ‌ల్లే కుమారుడిని కూడా ఓడించి ఇంటికి సాగ‌నంపార‌నే కామెంట్స్ నెటిజ‌న్లు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో పెడుతూ బాబుతో ఓ ఆట ఆడుకుంటున్నారు.

బైడెన్‌కు ట్రంప్ గ‌ట్టి పోటీ ఇచ్చార‌ని, అదే చంద్ర‌బాబు గాలికి పోయార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతుండడం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌ను ట్రంప్‌తో పోల్చి అవ‌మానించాల‌ని భావించిన చంద్ర‌బాబు, చివ‌రికి తానే అభాసుపాలు కావాల్సి వ‌స్తోంది. ఎవ‌రు తీసిన గోతిలో వారే ప‌డ‌తారంటే  చంద్ర‌బాబు ఉదంత‌మే నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

తిట్టు..తిట్టించుకో..

ఇంటి వ‌ద్ద‌కే బియ్యం

ఆ ముగ్గురూ ముగ్గురే

 


×