cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

న్యూడ్ వీడియోలు.. తెరవెనక పోలీస్ బాసులు

న్యూడ్ వీడియోలు.. తెరవెనక పోలీస్ బాసులు

గుంటూరులో సంచలనం సృష్టించిన న్యూడ్ వీడియోస్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడు.. పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్న ఇద్దరు అధికారుల ముద్దుల కొడుకుగా అధికారులు గుర్తించారు. ముందుగా సదరు యువతిని లొంగదీసుకున్నది ఇతడే అని అనుమానిస్తున్నారు. అయితే తమ కొడుకుని రక్షించుకునేందుకు ఆ పోలీస్ తల్లిదండ్రులు అప్పుడే రంగంలోకి దిగారు. తమ దగ్గరున్న టెక్నాలజీతో అన్ని ఆధారాల్ని వాళ్లు డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక్కడితో ఆ పోలీస్ తల్లిదండ్రులు ఆగలేదు. తమ కొడుకును మరో రహస్య ప్రదేశానికి తరలించారు కూడా. ప్రస్తుతం అతడి ఆచూకీ ఎవ్వరికీ దొరకడం లేదు. ఫోన్ సిగ్నల్ కూడా అందుబాటులో లేదు.

మరోవైపు అధికారులు మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు. యువతిని నగ్నంగా వీడియోలు తీసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిచ్చిన సమాచారం ఆధారంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

అయితే ఇతడితో పాటు "మై నేజ్ ఈజ్ 420" పేరుతో మరో వ్యక్తి కూడా యువతి న్యూడ్ వీడియోస్ ను ఇనస్టాగ్రామ్ లో పెట్టాడు. 50వేలు ఇవ్వాలని యువతికి ఫోన్ చేసి బెదిరించాడు కూడా. "మై నేజ్ ఈజ్ 420" అనే ఈ యూజర్ ఐడీ.. ఆ పోలీస్ దంపతుల కొడుకుదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. గూగుల్, ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్స్ కు ఐపీ అడ్రెస్ ల కోసం లేఖలు కూడా రాశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న ఓ అమ్మాయిని వరుణ్, కౌశిక్ లొంగదీసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువతిని ప్రేమించినట్టు నటించి ఆమె నగ్న దృశ్యాలు చిత్రీకరించారు. దాదాపు మూడేళ్లుగా వేధిస్తున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో మరో దారుణమైన కోణం ఏంటంటే.. వరుణ్ మరో గర్ల్ ఫ్రెండ్ కు, కౌశిక్ చెల్లెలకు కూడా ఇందులో ప్రమేయం ఉంది. వీళ్ల నుంచే సదరు యువతి నగ్న వీడియోలు పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు