cloudfront

Advertisement


Home > Politics - Political News

రొమాంటిక్ పోజులు.. ఇరకాటంలో పడ్డ హీరోయిన్!

రొమాంటిక్ పోజులు.. ఇరకాటంలో పడ్డ హీరోయిన్!

తన భర్తతో ప్రేమను కాస్త అతిగా చూపించబోయి.. తాము చాలా ప్రేమగా, సన్నిహితంగా ఉంటామని ప్రచారం చేసుకోబోయి అడ్డంగా బుక్ అయ్యింది ప్రియాంక చోప్రా. ఇటీవలే తనకన్నా వయసులో చాలా చిన్నవాడు అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక.. పెళ్లి అయిన దగ్గర నుంచి తరచూ తమ ఫొటోలను ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేస్తూ ఉంది. బయట తిరిగినప్పుడు, విరామం తర్వాత కలిసినప్పుడు.. ఇలాంటి ఫొటోలను పోస్టుచేస్తూ వచ్చింది. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. తాజాగా కొన్ని గంటల క్రితం ప్రియాంక పోస్టు చేసిన ఫొటో మాత్రం ఈ హీరోయిన్ పై సెటైర్లు పడేలా చేస్తోంది.

ఇది ప్రియాంక, నిక్ లు బెడ్రూమ్ ఫొటో. నిక్ భుజం మీద ప్రియాంక వాలిపోయి, తన్మయంతో కళ్లు మూసుకుని ఉన్న పోజు చూడటానికి బాగానే ఉంది. అలాగే దీనికి హోం అనే క్యాప్షన్ కూడా పెట్టి.. పొయెటిక్ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది. ప్రియాంక ఇంతవరకే ఆలోచించినట్టుగా ఉంది. అయితే చూసేవాళ్లు మాత్రం వేరే కామెంట్లు చేస్తున్నారు.

‘బెడ్రూమ్ లోకి కూడా కెమెరామెన్ ను తీసుకెళ్లావా..’ అంటూ ప్రియాంకకు ఘాటైన ప్రశ్నను వేస్తున్నారు ఆమె ఫాలోయర్లు. తమ బంధం ఎంత అందంగా ఉందో చెప్పడానికి ప్రియాంక ఈ పిక్ ను పోస్టు చేస్తే.. అది మిస్ ఫైర్ అయ్యింది.

ప్రియాంక అతి చేస్తోందని.. తను, తన భర్త చాలా క్లోజ్ అని చెప్పుకోవడానికి ఇలా బెడ్రూమ్ లో ఫొటోలు దిగి పోస్టు చేస్తోందని.. ఇంతటితో ఆగుతుందా? లేక ముందుకు వెళ్తుందా? అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.

మీరు ఇలా ఏకాంతంగా ఉండగా.. ఫొటోలు ఎవరు తీశారు? అనే కామెంట్లూ పడుతున్నాయి. మొత్తానికి ప్రియాంక ఏదో చెప్పబోతే.. జనాలకు మరేదో అర్థం అయినట్టుగా ఉంది!

అనంతపురంలో వీళ్లు ఔట్?... కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు