cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

నిగ్గ‌దీసి అడుగుతోంది...

నిగ్గ‌దీసి అడుగుతోంది...

తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారం రోజుల ప్ర‌చారానికి నేడు రానున్నారు. శ్రీ‌వేంకటేశ్వరుని ఆశీస్సులు అందుకున్న త‌ర్వాత‌, ప్ర‌జల దీవెన‌ల కోసం ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్ల‌నున్నారు. రాజ‌కీయ పార్టీల‌కు స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్లు. అయితే ఇది ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మేన‌ని గుర్తించాలి.

బాబు ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీ‌కారం చుడుతున్న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ స‌మాజం కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కోరుకుంటోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చివ‌రిగా ఆయ‌న రెచ్చ‌గొట్టే ఉప‌న్యాసాలు సీమ గుండెల్లో మార్మోగుతున్నాయి. అందుకే సీమ స‌మాజం చంద్ర‌బాబును గ‌ట్టిగా నిల‌దీసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది.

విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్లలో ప్ర‌చారంలో భాగంగా.... ఏ మాత్రం సిగ్గు, పౌరుషం ఉన్నా వైసీపీకి ఓట్లు వేస్తారా? అని ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లోని ప్ర‌జానీకానికి పౌరుషం లేద‌ని, అందువ‌ల్లే ఈ ప్రాంతం నుంచి రాజ‌ధానిని త‌ర‌లించుకుపోయినా క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా లేద‌ని తిట్ల‌కు దిగారు. 

ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పేందుకు త‌గిన స‌మ‌యం వ‌చ్చింద‌ని, కావున కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అలాగే విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నక‌ల్లో పొర‌పాటున వైసీపీని గెలిపిస్తే ....మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన‌ట్టే అని హెచ్చ‌రించారు. బాబు ఎంత‌గా రెచ్చ‌గొట్టినా, ప్ర‌జానీకం తీర్పు ముందు ఆయ‌న ప‌ప్పులుడ‌క‌లేదు.

ఈ నేప‌థ్యంలో క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని విష‌య‌మై చంద్ర‌బాబు త‌న వైఖ‌రి చెప్పాల‌నే డిమాండ్స్ సీమ స‌మాజం నుంచి వ‌స్తున్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీని గెలిపిస్తే న్యాయ రాజ‌ధానికి ఆమోద ముద్ర వేసిన‌ట్టేన‌ని బాబు చెప్ప‌గ‌ల‌రా? అని ఈ ప్రాంతం నిల‌దీస్తోంది. త‌మ‌కు క‌నీసం హైకోర్టు అయినా ఇవ్వాల‌ని రాయ‌ల‌సీమ స‌మాజం చేస్తున్న డిమాండ్‌ను ఖాత‌రు చేయ‌ని బాబు నైజంపై ఆ ప్రాంతం మండిప‌డుతోంది.

ప్రాంతాన్ని బ‌ట్టి మాట‌లు మార్చే చంద్ర‌బాబు ఊస‌ర‌వెల్లికి మించిపోయార‌నే విమ‌ర్శ‌లున్నాయి. తాజాగా వారం పాటు తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి వెళుతున్న చంద్ర‌బాబు ....విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడిన‌ట్టే, అక్క‌డ కూడా మాట్లాడే ద‌మ్ము, ధైర్యం ఉన్నాయా? అని సీమ పౌర స‌మాజం నిగ్గ‌దీసి అడుగుతోంది. 

అలాగే అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో మిగిలిన ప్రాంతాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంపై కూడా ప్ర‌శ్నిస్తోంది. క‌మాన్ చంద్ర‌బాబు...ఫ్లీజ్ ఆన్స‌ర్‌.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×