Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏకగ్రీవాలపై అనుమానాలకు తావిస్తున్న నిమ్మగడ్డ వైఖరి...

ఏకగ్రీవాలపై అనుమానాలకు తావిస్తున్న నిమ్మగడ్డ వైఖరి...

గత ఏడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో MPTC , ZPTC లు ఏకగ్రీవాలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ బలవంతంగా చేసుకున్నాయని విమర్శలు చేశాయి. వాటిని రద్దు చేసి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ కూడా చేశాయి. 

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా సమస్యను పరిష్కరించాల్సిన కమిషన్ పద్దతిగా వ్యవహరించాలి. తిరుపతి లో విలేకరులతో మాట్లాడుతూ నిమ్మగడ్డ గత ఏడాది జరిగిన ఏకగ్రీవాలను పక్కన పెట్టినట్లు చెప్పారు అంతకు ముందు విజయవాడలో ఏకగ్రీవాలు జరిగిన మండల అధికారులను బదిలీలకు ఆదేశాలు జారీచేశారు. ఇక్కడే నిమ్మగడ్డ వైఖరి అనుమానాలకు తావిస్తోంది.

ఏకగ్రీవాలపై చట్టం ఏమి చెపుతుంది. 2020 లో ఏమి జరిగింది.

ఏకగ్రీవాలు ఇష్ట పూర్వకంగా జరగాలి. బలవంతంగా జరపడం చట్టవ్యతిరేకమైన చర్య అవుతుంది. గత ఏడాది మార్చిలో MPTC , ZPTC , మున్సిపల్ , పంచాయతీ లకు షెడ్యూల్ విడుదల చేసారు. పంచాయతీలకు మినహా మిగిలిన అన్నింటికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ZPTC , MPTC లకు నామినేషన్లు పూర్తి కావడంతో బాటు చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. 

చట్టం ప్రకారం అభ్యంతరాలు ఉంటే సంబంధించిన వ్యక్తులు రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేయాలి. ఫిర్యాదులు పరిశీలించిన కమిషన్ రద్దు చేయడం లేదా తిరస్కరించడం చేయాలి. అందుకు భిన్నంగా ఏకగ్రీవాలకు డిక్లరేషన్ ఇచ్చినారు అధికారులు. ఒక వేల స్థానిక అధికారులు తప్పు చేసి ఉంటే డిక్లరేషన్ ఇచ్చే ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసిఉండాలి. అలాంటి ప్రయత్నం చేయకుండా ఎన్నికలను వాయిదా వేశారు. 

ఎక్కడ ప్రక్రియ నిలిచిందో తిరిగి అక్కడి నుంచి మొదలవుతుంది అని ప్రకటించారు. చట్ట ప్రకారం ఒక సారి కమిషన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికపై అభ్యంతరాలు ఉంటే సంబంధించిన పోటీ దారులు కోర్టును ఆశ్రయించడం మినహా మరో గత్యంతరం లేదు. 

కమిషన్ మీద అనుమానం ఎందుకంటే...

తన చేతిలో అధికారం ఉన్నపుడు చర్యలు తీసుకోకుండా డిక్లరేషన్ ఇచ్చి తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కమిషనర్ నిమ్మగడ్డ లేక రాయడం అనుమానానికి మూలం. నిజానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిధిలోకి ఈ వివాదం రాదు. తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన కమిషన్ నాడు చెప్పినట్లు ఎక్కడ ప్రక్రియ ఆగిందో అక్కడ నుంచి మొదలెట్టకుండా నాడు నోటిఫికేషన్ విడుదల చేయని పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు పూనుకున్నారు. 

ఇపుడు గత ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగిన మండలాల అధికారులను బదిలీ చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేశారు. వారు తప్పు చేసినట్లు కమిషన్ భావిస్తే నాడు వాటిని అంగీకారాన్ని తెలిపిన కమిషనర్ ది కూడా తప్పే కధ. మరో వైపు గత ఏడాది జరిగిన ఏకగ్రీవాలను పక్కన పెట్టినట్లు ఎలా చెపుతారు రద్దు చేయడం లేదా పరిశీలించడం చేయాలి తప్ప పక్కన పెట్టినట్లు ఎలా చెపుతారు. 

అసలు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ వ్యవహారం తన పరిధి దాటి న్యాయస్థానం పరిధిలోకి వెల్లింది అని తెలిసి కూడా ఇంకా తన పరిధిలో ఉన్నట్లుగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించడమే అనుమానాలకు ఆస్కారం కల్పించింది.

అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, ఇప్పుడు నిమ్మగడ్డ.. 

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?