cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ సినిమా.. ఆ హీరోయిన్ ఆల్ మోస్ట్ ఫిక్స్?

పవన్ సినిమా.. ఆ హీరోయిన్ ఆల్ మోస్ట్ ఫిక్స్?

హీరోయిన్ లేకుండానే షూటింగ్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. అదే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్. రానా మరో హీరో. అతడికి మాత్రం హీరోయిన్ సెట్ అయింది. ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. పవన్ సరసన నటించే భామ మాత్రం సెట్ అవ్వట్లేదు. ఎట్టకేలకు ఈ మేటర్ ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.

సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ ను హీరోయిన్ గా తీసుకునేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. నిత్యా కూడా దాదాపు ఓకే చెప్పినట్టుంది. ఓ మంచి రోజు చూసి ఆమె పేరును ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకున్నారు. కానీ సాయిపల్లవికి 2 సమస్యలు ఎదురయ్యాయి. రీమేక్ చేయడానికి ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. దీనికితోడు సినిమాలో ఆమెది పెద్ద రోల్ కూడా కాదు. పైగా ఓ బిడ్డకు తల్లి పాత్ర అది. అందుకే ఆమె కాల్షీట్లు లేవని కవర్ చేసి డ్రాప్ అయింది.

నిత్యామీనన్ కు ఇలాంటి సమస్యల్లేవు. ఎలాంటి పాత్రనైనా పోషిస్తుంది. అందుకే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. తన సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని పవన్ పెద్దగా పట్టించుకోవట్లేదు ఈమధ్య. సో.. నిత్యామీనన్ ఎంపికతో పవన్ కు ఎలాంటి అభ్యంతరం, సంబంధం ఉండకపోవచ్చు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×