cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ట్రెండ్ మారింది.. స్టార్ డమ్ పోయింది

ట్రెండ్ మారింది.. స్టార్ డమ్ పోయింది

రాజకీయాలకు షార్ట్ కట్ సినిమా అనేది అందరి భావన. సినిమాల్లో ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంటే అట్నుంచి అటే పాలిటిక్స్ లోకి దూకేయొచ్చు. అన్నీ అనుకూలిస్తే ఏకంగా సీఎం అయిపోవచ్చు. అయితే ఇవన్నీ ఒకప్పుడు. 

ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత జమానా పోయింది. ఇప్పుడు రాజకీయాలకు,సినిమాలకు సంబంధం లేదు. సినిమాల్లో హీరోలు అనిపించుకున్నోళ్లు పాలిటిక్స్ లో జీరో అవుతున్నారు. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాయి. 

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కమల్ హాసన్. తమిళనాట ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సభలకు విపరీతంగా జనం వచ్చారు. కట్ చేస్తే, తాజాగా జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ ఓడిపోయారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన కమల్.. తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం మాట అటుంచి, ఏకంగా తనే ఓటమి పాలయ్యారు.

మరో నటి ఖుష్బూ కూడా ఈసారి పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఖుష్బూ చెన్నై థౌజెండ్ లైట్స్ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కేవలం సీటు కోసమే ఆమె బీజేపీలోకి వచ్చారు. సీటు అయితే సంపాదించుకున్నారు కానీ గెలుపు మాత్రం సాధించలేకపోయారు. 

ఇక కేరళ నుంచి స్టార్ హీరో సురేష్ గోపి కూడా ఓటమి పాలయ్యారు. త్రిసూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఈయన ఓడిపోక తప్పలేదు. అటు పశ్చిమ బంగలో కూడా సినీతారలు కొందరు పరాజయం పాలయ్యారు. టీఎంసీ తరఫున పోటీ చేసిన నటి సయంతిక బెనర్జీ, బీజేపీ తరఫున బరిలోకి దిగిన నటుడు యష్ దాస్ గుప్తా ఓటమి పాలయ్యారు.

తమిళనాట ఎన్నికల్లో గెలిచిన ఒకేఒక్క నటుడు ఉదయనిధి స్టాలిన్. డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకు ఈయన. చపాక్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. అయితే ఇక్కడ ఉదయనిధికి తన స్టార్ డమ్ కంటే, డీఎంకే గాలి, స్టాలిన్ స్టామినా ఎక్కువగా కలిసొచ్చిందనేది కాదనలేని వాస్తవం.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా నటుడు పవన్ కల్యాణ్ పరోక్షంగా పరాజయం పాలైనట్టే చెప్పుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున రత్నప్రభను నిలబెట్టి, స్టార్ క్యాంపైనర్ గా పవన్ ను రంగంలోకి దించారు. 

గెలుపు కోసం ఆ టైమ్ లో పవన్ ను ఏకంగా సీఏం అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ పవన్ ర్యాలీలు, ఊగిపోతూ చేసిన ప్రసంగాలు ఏ మూలకు పనికిరాలేదు. కేవలం బీజేపీని నోటా నుంచి మాత్రమే బయటపడేశాయి. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, ఈసారి పవన్ చలవతో నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. అంతే తేడా.

తాజా ఎన్నికలతో రాజకీయాల్లో స్టార్ డమ్ ఇక ఎంతమాత్రం పనికిరాదని తేలిపోయింది. ఈ విషయాన్ని చిరంజీవి, రజనీకాంత్, విజయశాంతి లాంటి వాళ్లు కాస్త ముందుగానే గ్రహించారు. 

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటే, రజనీకాంత్ ఏకంగా తన రాజకీయ జీవితాన్నే వదులుకున్నారు.విజయశాంతి రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారంతే. ఆమె ప్రభావం ఏమాత్రం లేదు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×