Advertisement

Advertisement


Home > Politics - Political News

నామినేటెడ్ సెగ బాగా తగులుతోందా... ?

నామినేటెడ్ సెగ బాగా తగులుతోందా... ?

అదేంటో వైసీపీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తే టీడీపీ గట్టిగా రియాక్ట్ అవుతోంది. నిజానికి నామినేటెడ్ పదవుల పంపిణీ తరువాత వైసీపీ నుంచి ఏ ఒక్కరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు.

పైగా విధేయత, నాయకులు దశాబ్దాలుగా పడిన కష్టం.. ఇలా అన్నీ చూసి మరీ పదవుల పంపకం చేశారు. ఇదే తీరున పనిచేస్తే మిగిలిన వారికి కూడా పదవులు దక్కుతాయన్న సందేశం కూడా వైసీపీ పెద్దలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ నామినేటెడ్ జాతరలో పెద్ద ఎత్తున బీసీలకు, ఇతర బడుగు బలహీన వర్గాలకు పదవులు దక్కాయి.

అలాగే మహిళలకు కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. మరి దీనిని విశ్లేషించుకున్న టీడీపీ నేతలు మాత్రం వేరేగా మాట్లాడుతున్నారు. ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే డబ్బున్న కుర్చీలు అన్నీ అగ్ర కులాలకు, ఏమీ లేని పదవులు బలహీనులకా అంటూ విమర్శిస్తున్నారు.

మరి ఆయన కళ్ళ ముందే విశాఖలోని ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవిని బీసీ మహిళ‌కు ఇచ్చిన సంగతిని మరచారా అంటున్నారు వైసీపీ నేతలు, ఇక విశాఖ మేయర్ గా బీసీ మహిళకే పట్టం కట్టిన సంగతి గుర్తు లేదా. 56 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఇచ్చిన వైనం ఏంటి అని కూడా నిలదీస్తున్నారు. 

ఇక్కడ ఒకటే పాయింట్, సామాజిక న్యాయం అంటూ వైసీపీలో జరుగుతోంది. తమ్ముళ్ళకు అదే బాగా మంటగా ఉంటోంది అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నామినేటెడ్ పదవులు గత అయిదేళ్ళల్లో పంచని టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తోంది అంటే ఆ సెగ బాగా తగిలేసింది అంటున్నారు కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?