cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏపీ ఎన్నికలు.. సగం కథ ఐపోయింది!

ఏపీ ఎన్నికలు.. సగం కథ ఐపోయింది!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో సగం కథ పూర్తి అయ్యింది. నామినేషన్ల అంకం పూర్తికావడంతో... సగం పని అయిపోయింది. అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్న నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోయినా నామినేషన్లు వేసేశారు. మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఏ పార్టీ తరఫున ఎన్ని నామినేషన్లు పడ్డాయి, అసలు క్యాండిండేట్స్ ఎవరు, రెబెల్స్ ఎవరు.. అనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఎన్నికల కమిషన్ అధికారులు నామినేషన్ల పరిశీలనను పూర్తిచేస్తే.. అభ్యర్థులు ఎవరెవరు రంగంలో ఉన్నట్టు అనే అంశం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ అంకం కూడా పూర్తి అయితే.. పోటీలో ఉండేదెవరు, చేతులెత్తేసేది ఎవరెవరు? అనే అంశాల గురించి పూర్తి స్పష్టత రానుంది.

ప్రస్తుతం సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో.. కొన్ని పార్టీల్లో చాలా గందరగోళం ఉంది. ప్రత్యేకించి పొత్తుతో ఎన్నికలకు వెళ్లిన జనసేన-కమ్యూనిస్టులు-బీఎస్పీ ట్రూపులో అసలు కథ ఏమిటో తేలాల్సి ఉంది. కొన్ని సీట్లకు అయితే నామినేషన్ల చివరిరోజుకు కానీ అభ్యర్థులను ప్రకటించలేదు జనసేన పార్టీ. ఈ నేపథ్యంలో.. చివరిరోజు అభ్యర్థిత్వాలు ఖరారు అయిన వారిలో ఎంతమంది నామినేషన్లు వేశారు? అనేది ఇంకా ప్రశ్నార్థకమే.

ఇక తెలుగుదేశం పార్టీకి రెబెల్స్ గోల అయితే గట్టిగానే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జి స్థాయినేతలు, తాజా మాజీలు కూడా నామినేషన్లు వేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అంకంలో వారు ఏ మేరకు గట్టిగా నిలబడాతారో చూడాల్సి ఉంది.

కీలకమైన నామినేషన్ల అంకం పూర్తి అయిన నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాల స్థాయిలో ఆయా పార్టీల కార్యకర్తలకు, సామాన్య ప్రజానీకానికి కూడా ఏ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థి అనే అంశంపై స్పష్టత వచ్చినట్టే!

ప్రజల సొమ్ముతో ప్రలోభాలు.. ఇదే నయా రాజకీయం!