Advertisement

Advertisement


Home > Politics - Political News

నాడు ఎన్టీయార్.. నేడు జగన్...

నాడు ఎన్టీయార్.. నేడు జగన్...

జగన్ గురించి పోలికలు చెప్పినప్పుడు కచ్చితంగా ఎన్టీయార్ ని చాలా మంది గుర్తుకుతెస్తారు. ఎన్టీయార్ లోని పట్టుదల, ఆత్మ గౌరవం, పౌరుషం వంటివి జగన్ లోనూ ఉంటాయని అంటారు. అలాగే ఎన్టీయార్ కి ప్రజలతో ఉన్న ప్రత్యక్ష అనుబంధం. ఆయనకు ఉన్న జనాదరణ, ప్రజలకు ఏదో చేయాలన్న తపన వంటివి కూడా జగన్ లో ఉన్నాయని చెబుతారు.

ఇక చాలా మంది నాయకులు వైఎస్సార్, ఎన్టీయార్ కలిపితే జగన్ అని కూడా అభివర్ణించారు. ఇవన్నీ జగన్ పాలనలో కూడా కనిపిస్తాయి. పేదవాడికి మేలు చేయాలని భావించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్టీయార్ ఎదురు వెళ్లి చేసేవారు. జగన్ లో ఆ గుణాలు ఉన్నాయని అంటారు.

ఇక ఎన్టీయార్ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ఎందాకైనా అన్నట్లుగా ఉండేవారు. సరిగ్గా ఇపుడు ఒక విషయం ఎన్టీయార్ తో జగన్ కి పోలిక తెచ్చేలా చేస్తోంది. వంశధార ప్రాజెక్టుల గురించిన‌ సమస్యల మీద చర్చించడానికి ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నపుడు ఎన్టీయార్ 1995లో నాటి ఒడిషా సీఎం బిజీ పట్నాయక్ తో భేటీ అయ్యారు.

ఇపుడు జగన్ కూడా ఇదే వంశధార ప్రాజెక్ట్ సమస్యల మీద బిజూ పట్నాయక్ కుమారుడు అయిన నవీన్ పట్నాయక్ ని కలుస్తున్నారు. ఇద్దరూ శ్రీకాకుళం అంటే విపతీరమైన ప్రేమను చూపించిన నాయకులే కావడం విశేషం. ఇక నేరేడి ప్రాజెక్ట్ పనులు పురుడు పోసుకున్నది కూడా వైఎస్సార్ జమానాలో కావడం ఇక్కడ చెప్పుకోవాలి. 

మొత్తానికి ఉత్తరాంధ్రా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రులు ముగ్గురే అంటున్నారు. వారిలో ఎన్టీయార్, వైఎస్సార్ తో పాటు ఇపుడు జగన్ కూడా ఉండడం విశేషంగానే చూడాలి. మొత్తానికి జగన్ ఒడిషా టూర్ సక్సెస్ అయితే మాత్రం ఆయన ఉత్తరాంధ్రా జనాలకు శాశ్వతంగా గుర్తుండిపోతారు అనడంలో సందేహం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?