cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పోలీసుల‌కు టాలెంట్ చూపిస్తున్న నూత‌న్నాయుడు!

పోలీసుల‌కు టాలెంట్ చూపిస్తున్న నూత‌న్నాయుడు!

త‌న టాలెంట్ ఏమిటో గ‌తంలో బిగ్ బాస్ హౌస్ లోనే చూపించిన ప‌వ‌న్ కల్యాణ్ వీర‌భ‌క్తుడు నూత‌న్నాయుడు ఇప్పుడు పోలీసు విచార‌ణ‌లో కూడా అదే టాలెంటే చూపిస్తున్న‌ట్టుగా ఉన్నాడు. ఒక ద‌ళిత యువ‌కుడికి గుండు కొట్టించ‌డంతో పాటు.. వివిధ చీటింగ్ వ్య‌వ‌హారాల్లో ఈయ‌న అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో విచారించ‌డానికి పోలీసులు ఆయ‌న‌ను క‌స్ట‌డీకి తీసుకున్నారు.

మూడు రోజుల పాటు పోలీసులు వివిధ అంశాల గురించి అడిగినా.. నూత‌న్నాయుడు మాత్రం అస‌లు విష‌యాల గురించి చెప్ప‌కుండా త‌న బ‌హుముఖ‌ప్రావీణ్యాన్ని చూపించాడ‌ట‌. త‌న‌కు క‌డుపు నొప్పి అని అంటూ.. ఈయ‌న పోలీసుల‌కు ఎలాంటి స‌మాధానాలూ చెప్ప‌లేద‌ని తెలుస్తోంది.

మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి తీసుకున్నా నూత‌న్నాయుడు నుంచి స‌మాధానాల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయార‌ట పోలీసులు. క‌డుపు నొప్పి అంటూ అత‌డు నాట‌కాలు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని పోలీసుల ద్వారా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయన కస్ట‌డీని పొడిగించాల‌ని తాము కోర‌బోతున్న‌ట్టుగా పోలీసులు తెలిపారు. మాజీ ఐఏఎస్ పేరుతో చేసిన వ్య‌వ‌హ‌రాలూ, ఇత‌ర కేసుల గురించి నూత‌న్నాయుడిని విచారించాల్సి ఉంద‌ని క‌స్ట‌డీని మ‌రి కొంత పొడిగించాల‌ని న్యాయ‌స్థానాన్ని పోలీసులు కోర‌నున్నార‌ని తెలుస్తోంది.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా? 

 


×