cloudfront

Advertisement


Home > Politics - Political News

ఒకటి లేదా రెండు.. అంతేనా బాబూ.!

ఒకటి లేదా రెండు.. అంతేనా బాబూ.!

దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 'కూటమి' కడుతున్నామంటూ ఢిల్లీ వేదికగా హైరానా పడుతోన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన కూటమిలోకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించేశారు. జాతీయ మీడియాకి చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిథి చంద్రబాబుని ఈ విషయమై ప్రశ్నిస్తే, ఆయన నోట వచ్చిన మాటలు బోల్డంత కామెడీని పండించేశాయి.

'ఎన్నికల తర్వాత అవసరమైతే, వైఎస్సార్సీపీతోనూ పొత్తు పెట్టుకుంటారా.?' అన్నది ఆ ప్రశ్న. 'ఆయన్ని రమ్మనండి, ఆహ్వానిస్తాం. ఒకటి రెండు సీట్లు ఆయనకు గనుక వస్తే, ఎందుకు వద్దనుకుంటాం.?' అంటూ చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. నేషనల్‌ మీడియా ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో చంద్రబాబు చాలా తడబడ్డారు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని చంద్రబాబు ఉపయోగించేసరికి, సదరు జర్నలిస్ట్‌ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

ఇక, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఎంపీ సీట్లు దక్కుతాయనీ, అసెంబ్లీ సీట్ల పరంగానూ వైఎస్సార్సీపీకి తిరుగులేదని చాలా జాతీయ సర్వేలు 'ముందుగానే' తేల్చేశాయి. ఓ సర్వే అయితే, 23 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకే దక్కుతాయనీ, 140 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంటుందనీ స్పష్టం చేసిన విషయం విదితమే. ఎక్కడా టీడీపీకి 6 సీట్లకు మించి అవకాశం వుందనే సర్వే కన్పించలేదు ఇటీవలి కాలంలో.

మరి, చంద్రబాబు - వైఎస్‌ జగన్‌కి ఒకటి లేదా రెండు ఎంపీ సీట్లు వస్తే.. వైఎస్‌  జగన్‌, బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరతానంటే ఆహ్వానిస్తామంటూ.. కహానీలు విన్పించడమేంటట? 'అవసరమైతే చంద్రబాబు, వైఎస్సార్సీపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడరు..' అంటూ బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది గత కొంతకాలంగా. 'అవసరమైతే ఏంటి, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులయ్యారంటే.. ఇది టీడీపీ - వైఎస్సార్సీపీ ప్రభుత్వమే..' అంటూ బీజేపీ ఎద్దేవ చేస్తోన్న విషయమూ విదితమే. అది రాజకీయ విమర్శేననుకోండి.. అది వేరే విషయం.

చంద్రబాబు పిలిస్తే మాత్రం, వైఎస్‌ జగన్‌ - టీడీపీ చెంతన చేరతారా.? అధికారం వైసీపీకి అతి సమీపంలో కన్పిస్తోంటే, చంద్రబాబు అవసరం వైఎస్‌ జగన్‌కి ఎందుకు మద్దతిస్తారట.? ఛాన్సేలేదు. జాతీయ మీడియాతో తనకున్న 'పరిచయాల్ని' అడ్డంపెట్టుకుని, జనానికి తప్పుడు సంకేతాలిచ్చే క్రమంలో.. చంద్రబాబు ఇదిగో, ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేయించుకుని.. తనకు మాత్రమే సాధ్యమయ్యే సమాధానాలిస్తూ పండగ చేసుకుంటున్నారన్నమాట.  

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు