cloudfront

Advertisement


Home > Politics - Political News

మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తెస్తున్న మోడీ సర్కార్!

మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తెస్తున్న మోడీ సర్కార్!

దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న తన ప్రణాళిక అమలుకు మళ్లీ సానపెడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. గత పర్యాయం అంతా ఈ విషయంలో మోడీ గట్టిగానే ప్రయత్నం చేశారు.  లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలని, రానున్న పదేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు, అదే సమయంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రావాలని మోడీ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కు అన్ని పార్టీలనూ ఒప్పించే ప్రయత్నం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆ అంశం మీదో పలు మీటింగులు కూడా నిర్వహింపజేశారు. అయితే ఆ విషయంలో చర్చల ఫలితాలు సానుకూలంగా రాలేదు. అలా ఎన్నికలు జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేంద్రంలో ఎవరి అధికారంలో ఉండే వారికి అనుకూలంగా జరుగుతాయనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపించాయి. దీంతోనే బీజేపీయేతర పార్టీలు ఆ విషయంలో వ్యతిరేకతను వ్యక్తంచేశాయి.

గత ఐదేళ్లలో అయితే తమ ప్రణాళికను అమలులో పెట్టడానికి కమలనాథులు ప్రయత్నాలు సాగించారు. వాటికి సానుకూల ఫలితాలు రాలేదు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. అంతకుముందే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ విషయంలో అప్పుడు అనుకున్నది సాధించలేకపోయిన కమలనాథులు ఇప్పుడు అధికారాన్ని అందుకుని మళ్లీ ఆ అంశం మీద చర్చలు మొదలుపెడుతూ ఉన్నారు. ఈ అంశంలో చర్చలకు రావాలని వివిధ పార్టీల అధినేతకు మళ్లీ పిలుపులు అందాయట. ఈసారి కూడా విపక్షాలు దాన్ని వ్యతిరేకించే అవకాశమే ఉంది. 

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!