Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆన్‌లైన్‌లో అత్య‌ధిక వెతుకులాట దేనికోస‌మంటే?

ఆన్‌లైన్‌లో అత్య‌ధిక వెతుకులాట దేనికోస‌మంటే?

ఆన్‌లైన్‌...ఆన్‌లైన్‌...ఇప్పుడు ప్ర‌తిదీ ఆన్‌లైన్ బాటే. పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ పాఠాలు, పెద్ద‌ల‌కు ఆన్‌లైన్ ఉద్యోగాలు. ఇలా ఇది అది అని కాదు...అన్నీ ఆన్‌లైన్ మ‌యం అయ్యాయి. ఆన్‌లైన్‌లో భార‌తీయులు అత్య‌ధికంగా దేనికోసం వెతుకుతున్నారో తెలిస్తే... భ‌విష్య‌త్‌లో ఉద్యోగ రూపు రేఖ‌లు ఎంత‌గా మార‌బోతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

వ‌ర్క్ ఫ్రం హోం లేదా రిమోట్ వ‌ర్కింగ్ అంటూ గూగుల్‌లో భార‌తీయులు ఎక్కువ‌గా వెతుకుతున్నారు. ఈ సెర్చింగ్ గ‌తంతో పోల్చితే 442 శాతం పెరగ‌డం యువ‌త‌రం ఆలోచ‌న‌ల‌ను, ఉద్యోగ‌, ఉపాధి ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబిస్తోంది. అలాగే ఏ ఇద్ద‌రు ఫోన్లో మాట్లాడుకున్నా ఆన్‌లైన్ ఉద్యోగ అవ‌కాశాల ప్ర‌స్తావ‌నే.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఉద్యోగ అవ‌కాశం అంటే  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మాత్ర‌మే అని అభిప్రాయం ఉండేది. కానీ మారిన కాల‌మాన ప‌రిస్థితుల్లో ప‌ని స్వ‌భావంలో విప్ల‌వాత్మ‌క మార్పు వ‌చ్చింది. సాఫ్ట్‌వేర్‌తో పాటు మీడియా రంగం వ‌ర‌కు కూడా ఆన్‌లైన్ ప‌నిచేసే వెస‌లుబాటు వ‌చ్చింది. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు ఇది.

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భార‌తీయులు అత్య‌ధికంగా 442 శాతం మంది ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ అవ‌కాశాల కోసం వెతుకుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ‘ఇండీడ్‌’ప్లాట్‌ ఫాం ద్వారా సేకరించిన స‌మాచారం ఆధారంగా ప్ర‌పంచ వ్యాప్తంగా నిరుద్యోగులు, యువ‌త ఉపాధి అవ‌కాశాల‌పై చేస్తున్న అధ్య‌య‌నంపై  పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గత నెల జూలై మధ్యకాలంలో ఇంటి నుంచి చేసే ఉద్యోగాల కోసం భారతీయులు భారీగా  ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసినట్టు ఈ అధ్యయనం వెల్ల‌డించింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్, మార్కెటింగ్‌ వంటి రంగాల్లో ఉద్యోగ అవకా శాలు బాగా పెరిగినట్టు, ముఖ్యంగా డెలివరీ పర్సన్లు, ఐటీ మేనేజర్లకు అవకాశాలు మరింతగా డిమాండ్‌ ఉన్నట్టుగా వెల్లడిం చింది. ఇంటి వ‌ద్ద‌కే ఉద్యోగావ‌కాశాలు వెతుక్కుంటే వ‌స్తే అంత‌కంటే ఆనందం ఏం ఉంటుంది? 

మెగాస్టార్ అస్సలు తగ్గట్లేదు

10 ప్యాక్ తో వస్తున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?