cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్టు..

కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్టు..

తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక విషయంలో విపక్షపార్టీలు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తోంటే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడానికి చేస్తున్న ప్రయత్నంలాగా కనిపిస్తోంది. ఏ మాత్రం పసలేని ఒక అంశాన్ని పట్టుకుని.. దానినే పదేపదే హైలైట్ చేయడం ద్వారా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నరరూప రాక్షసుడిగా చిత్రించేయగలుగుతున్నట్లుగా.. వాళ్లు అంతరంగంలో సంబరపడిపోతున్నారేమో గానీ.. ప్రజలు మాత్రం వారి ప్రయత్నాల్ని చూసి నవ్వుకుంటున్నారు.

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మరణం అనేది ఒక ప్రచార ఎజెండా కావడమే చాలా చిత్రమైన అంశం. తెదేపా- జనసేన (బీజేపీ) మధ్య లోపాయికారీ ఒప్పందాలు నడుస్తున్నాయంటే వారు ఉడుక్కుంటారు గానీ.. వాస్తవంలో జరుగుతున్నది అదే అని కళ్ల ముందు కనిపిస్తోంది. 

నాలుగురోజుల కిందట పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ పెడితే.. వైఎస్ వివేకా హత్య మీద నానా యాగీ చేశారు. తాజాగా తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలుగుదేశం నారా లోకేష్ కూడా.. వైఎస్ వివేకా హత్య తమ కుటుంబం చేయలేదని తాను ప్రమాణం చేస్తానని, జగన్ కూడా అలాంటి ప్రమాణం చేయగలరా? అని.. ఒక యూజ్‌లెస్ సవాలు విసురుతున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీగా చేశారు. నిజానికి ఆయన అన్నచాటు తమ్ముడే. రాజశేఖర రెడ్డి ప్రాభవం వల్లనే.. ఆయన రాజకీయ జీవితం పాదులు దిద్దుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడిగానే ఆయనను ప్రతిసారీ ప్రజలు గెలిపించారు. రెండేళ్ల కిందట ఆయన హత్యకు గురయ్యారు. అందుకు రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. వివేకాకు మంచి వ్యక్తిగా పేరున్నదే తప్ప.. ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు కాదు. కడప జిల్లా దాటి చిత్తూరు జిల్లా దాకా వస్తే.. అసలు ఆయనకు సంబంధమే లేదు.

అలాంటిది.. ఆయన హత్యోదంతాన్ని తిరుపతి ప్రజల నిత్యావసరం అయినట్టుగా.. ఈ ఉప ఎన్నికలో ప్రచారానికి వాడుతుండడం చిత్రంగా కనిపిస్తోంది. వివేకా హత్య గురించి మాట్లాడితే.. సగానికి పైగా నెల్లూరు జిల్లాలో కూడా విస్తరించిన తిరుపతి నియోజకవర్గం ప్రజలు అసలు ఎందుకు పట్టించుకుంటారనేది ఆశ్చర్యకరమైన విషయం.

టీడీపీ, జనసేన-బీజేపీ ప్రచారంలో వివేకా ప్రధానపాత్ర పోషించడం అనేది ఆ పార్టీల చేతగానితనానికి ఒక ప్రతీక. ఉపఎన్నిక జరుగుతున్నప్పుడు.. ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వం అసమర్థతను ప్రచారం చేస్తే వారు నెగ్గుతారు. 

చూడబోతే.. ఈ మూడు పార్టీలకు జగన్ పాలనలో.. అసలు అపసవ్యత ఏమీ కనిపిస్తున్నట్టు లేదు. పైపై విమర్శల మీద ఆధారపడుతూ.. ప్రభుత్వంలో లోపాలు చెప్పలేక, ప్రభుత్వ పథకాల్ని విమర్శిస్తే.. ప్రజలు తమమీదనే తిరగబడతారనే భయంతో.. దిక్కుతోచకుండా.. ఎన్నికల ప్రచారం అన్నాక ఏదో ఒక విమర్శలు చేయాలి గనుక.. వివేకా విషయాన్ని ప్రస్తావిస్తూ.. రోజులు గడిపేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×