cloudfront

Advertisement


Home > Politics - Political News

పాపం సోమిరెడ్డి, ఓటమి అలవాటైపోయిందంతే.!

పాపం సోమిరెడ్డి, ఓటమి అలవాటైపోయిందంతే.!

పాపం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయనగారికి ఓటమి అలా అలవాటైపోయిందంతే. మరోమారు ఓటమి పాలయ్యారు.. ఎన్నికల్లో గెలిచేసి అసెంబ్లీకి వెళ్ళిపోదామనే అత్యుత్సాహంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటట.? ఎన్నికల కోడ్‌ అమల్లో వుందని తెలిసీ, నానాయాగీ చేసి వ్యవసాయశాఖ మంత్రిగా తన 'దర్పం' ప్రదర్శించబోయి, ఒకటికి రెండుసార్లు అభాసుపాలైన సోమిరెడ్డికి పాపం అధికారులు 'పోన్లే' అని ఓ ఛాన్స్‌ ఇచ్చి, సమీక్షా సమావేశానికి హాజరవడం కొద్దిరోజుల క్రితమే తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెల్సిందే.

'మా ప్రభుత్వానికి జూన్‌ 8వ తేదీ వరకూ ప్రజలిచ్చిన అధికారం వుంటుంది..' అని సోమిరెడ్డి అప్పట్లో ఘంటాపథంగా చెప్పారుగానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి 'తత్వం' చాలా తొందరగా బోధపడి, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకుండానే 'ట్రెండ్‌' చూసుకుని, పార్టీ పరాభవాన్ని తలచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు.

తెలుగుదేశం పార్టీలో చిటపటలాడే నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు భజన చేయడంలో సోమిరెడ్డికి సాటి ఇంకెవరూ రారంతే. ఏకంగా చంద్రబాబుని ప్రధానమంత్రి అభ్యర్థిగానూ సోమిరెడ్డి అభివర్ణించేశారు. అందుకే, ఆ స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించబట్టే సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డికి చుక్కలు చూపించేశారు.

ఒకటోస్సారి, రెండోస్సారి, మూడోస్సారి, నాలుగోస్సారి.. ఇలా లెక్కలేసుకోవడమే.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మిగిలిందిప్పుడు. దాదాపుగా సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకి ఈ ఎన్నికలతో శుభంకార్డు పడిపోయినట్లేనని స్థానిక టీడీపీ శ్రేణులే ఓ నిర్ణయానికి వచ్చేశాయి.  

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా