Advertisement

Advertisement


Home > Politics - Political News

పాపం.. సుజనా చౌదరి ఎంత అమాయకుడో.!

పాపం.. సుజనా చౌదరి ఎంత అమాయకుడో.!

తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల గురించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? చంద్రబాబుకి బినామీలుగా ఈ ఇద్దరిపైనా ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ బీజేపీలోకి వెళ్ళారంటే, చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయకుండా వుంటారా.? చంద్రబాబే ఆ ఇద్దర్నీ, వాళ్ళతోపాటు మరో ఇద్దర్నీ బీజేపీలోకి పంపారన్న అనుమానాలు చాలా వైపులా నుంచి వ్యక్తమవుతున్నాయి. 

'నాకు డబ్బులతో పనేంటి.? నాకు పదవులతో పనేంటి.? ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను..' అని సుజనా చౌదరి నీతులు చెబుతోంటే, వినేవాళ్ళకి చెవులు బరువెక్కిపోతున్నాయ్‌. అంతలా జనం చెవుల్లో సుజనా చౌదరి క్యాలీఫ్లవర్లు పెట్టేస్తున్నారు మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?