cloudfront

Advertisement


Home > Politics - Political News

ఫస్ట్ బాబు.. నెక్ట్స్ పవన్.. ఆ విద్య బాగానే అబ్బింది

ఫస్ట్ బాబు.. నెక్ట్స్ పవన్.. ఆ విద్య బాగానే అబ్బింది

ఆరునెలలు కలిసి తిరిగితే వాళ్లు వీళ్లు అవుతారంటారు. అలాంటిది నాలుగున్నరేళ్లు రాసుకుపూసుకు తిరిగిన తర్వాత మారకుండా ఉంటారా. పవన్ లో కూడా ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగేళ్లు చంద్రబాబుతో చేసిన సావాస ఫలితం ఇప్పుడు ప్రజల కళ్లముందు కనిపిస్తోంది. అదే సొంతడబ్బా.

అన్నీ నేనే చేశానని చెప్పుకోవడం బాబు స్టయిల్. ఏకంగా వాజ్ పేయిని ప్రధానిని చేసింది నేనే, సెల్ ఫోన్ కనిబెట్టింది నేనే అని చెప్పుకునే స్థాయికి ఈయన ఫోబియా చేరింది. ఈ విషయంలో బాబుకు నంబర్ వన్ స్థానం ఇవ్వాల్సిందే. నంబర్-2 ఎవరని ఆలోచిస్తే ఆ స్థానానికి పోటీ లేకుండా ఎన్నికవుతారు జనసేనాని పవన్ కల్యాణ్.

అవును.. సొంత డబ్బా కొట్టుకోవడంలో, తన గురించి తను గొప్పగా చెప్పుకోవడంలో పవన్ ఇప్పుడు పీహెచ్డీ పుచ్చుకున్నారు. సమయం ఎంతైనా, సందర్భం ఏదైనా, దేశంకానీ దేశమైనా తన గురించి మంచిగా ఓ అర్థగంట చెప్పుకోవడం పవన్ కు ఇప్పుడు అలవాటుగా మారింది.

జనసైనికులతో జిల్లాల వారీగా సమావేశాలు.. ముఖ్యపట్టణాల్లో పబ్లిక్ మీటింగ్స్.. విదేశాల్లోని తెలుగు ప్రజలతో ముఖాముఖి.. పోరాటయాత్రలు ఇలా పేరుమారినా, సందర్భం మారినా పవన్ వ్యవహార శైలి మాత్రం బొత్తిగా మారడంలేదు. అదే సొంతడబ్బా. అవే డైలాగులు. ఈ విషయంలో మిగతా రాజకీయ నాయకులంతా వేస్ట్, గాంధీ తర్వాత నేనే అనే రేంజ్ లో ఉంటున్నాయి పవన్ మాటలు.

నేను ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చాను.. నాకు అన్ని కులాలు ఒకటే.. శత్రువును కూడా గౌరవంగా చూస్తాను.. గౌరవప్రదంగా మాట్లాడే రాజకీయ నాయకుడ్ని నేనొక్కడినే.. ఎన్నితిట్లు అయినా తినే సహనం నాకుంది.. నేను కూడా ఓ రైతు బిడ్డనే.. కష్టం అంటే ఏంటో నాకు తెలుసు... గడిచిన 2-3 రోజుల్లో తన గురించి గొప్పగా పవన్ చెప్పుకున్న మాటలివి. 2 రోజుల్లోనే ఇన్ని డైలాగులంటే.. ఈ 6 నెలల్లో ఆయన ఇంకెన్ని మాటలు చెప్పి ఉంటారో ఊహించుకోవచ్చు.

కార్యకర్తలతో సమావేశాలు, పార్టీ అంతర్గత భేటీలు ఉన్నప్పుడు మాట్లాడే అంశాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. ప్రాంతాల వారీగా, కులాల వారీగా విశ్లేషణలు చేసుకోవాలి. ప్రతిపాదిన నియోజకవర్గం నుంచి నికార్సైన అభ్యర్థులెవరో చర్చ జరగాలి. ఫైనల్ గా ఆ మీటింగ్ నుంచి ఓ తీర్మానం బయటకు రావాలి.

కానీ పవన్ మీటింగ్స్ లో సూక్తిముక్తావళి, సొంత డబ్బా తప్ప రాజకీయ ప్రస్థావన, ప్రజల సమస్యలు చర్చకు రావడంలేదని స్వయంగా కొంతమంది జనసైనికులే చెబుతున్నారు. ఇప్పటికైనా జనసేనాని తన పంథా మార్చుకొని.. పార్టీ నిర్మాణంపైన, ప్రజల సమస్యలపైన, రాబోయే ఎన్నికలపైన దృష్టిపెడితే బాగుంటుందేమో.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది