cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబుకి క్లారిటీ వచ్చేసింది.. పవన్ కి రావాల్సి ఉంది

బాబుకి క్లారిటీ వచ్చేసింది.. పవన్ కి రావాల్సి ఉంది

పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఎన్నికల కమిషనర్ స్థానంలో తన మనిషి ఉన్నా, తనకి అనుకూలంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా.. జనం మాత్రం జగన్ వైపే ఉన్నారనే విషయం తేలిపోయింది. కులపు ఓట్లతో గట్టెక్కిన చోట్ల మినహాయిస్తే.. పల్లెలన్నీ వైసీపీ పాలనలో సంతోషంగా ఉన్నాయి. ఏకగ్రీవాలు కానిచోట్ల వైసీపీతో వైసీపీ అభ్యర్థులే పోటీ పడ్డారు కానీ, టీడీపీకి అవకాశమే ఇవ్వలేదు.

తొలిదశలో గెలుపుమాదేనంటూ రాద్ధాంతం చేసి, మూడో దశ కుప్పంలో పరాభవం చవిచూసిన తర్వాత అంతర్మథనంలో పడిపోయారు చంద్రబాబు. వైసీపీ గెలుపుని పరోక్షంగా ఒప్పుకుంటూనే, ప్రజాస్వామ్యం ఓడిందని కొత్త లాజిక్ చెప్పేశారు.

చంద్రబాబుకి జ్ఞానోదయం ఏ స్థాయిలో అయిందంటే.. అసలు మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల గురించి ఒక్క మాటయినా ఆయన మాట్లాడలేకపోతున్నారు. గతంలో ఎన్నికలు జరపాల్సిందేనంటూ పట్టుబట్టిన బాబుకి, పంచాయతీ పోరు ముగిసేసరికి ఓ క్లారిటీ వచ్చేసింది. కోరి ఎన్నికలు తెచ్చుకోకూడదని జ్ఞానోదయం అయింది.

ఇక పవన్ విషయానికొద్దాం..

పవన్ కల్యాణ్ కి ఈ క్లారిటీ ఇంకా రాలేదు. పంచాయతీ ఎన్నికల్లో రెండు సర్పంచి స్థానాలు, మరో 10 వార్డు మెంబర్ స్థానాలు గెలిచే సరికి జనసేనకి కొత్త జవసత్వాలు వచ్చాయని అనుకుంటున్నారు జనసేనాని. అందుకే ఆయన పరిషత్ ఎన్నికల కోసం నానా యాగీ చేస్తున్నారు. ఏకగ్రీవాల పోస్టుమార్టం కోసం ప్రయత్నించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఆల్రెడీ కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు.

ఈ దశలో పవన్ కల్యాణ్ కోర్టు తీర్పుపై అవగాహన ఉండి మాట్లాడుతున్నారో, తెలియక స్టేట్ మెంట్లిస్తున్నారో కానీ.. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేష్ విడుదల చేయాలంటూ పట్టుబడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ విషయంలో జరిగిన అన్యాయలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.

ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నిర్ణయమే ఫైనల్ అని, ఫామ్-10 స్వీకరించిన విజేతల స్థానాలపై ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్ అంటే.. విజేతలకు ఇచ్చిన ఫామ్-10 లకు విలువ లేనట్టే లెక్క. ఈ దశలో పవన్ న్యాయపోరాటం చేసినా ఫలితం ఉంటుందా అనేది అనుమానమే. ఏ రాజకీయ స్వలాభం కోసం పవన్ కల్యాణ్ కొత్త నోటిఫికేషన్ అంటున్నారో ఆయనకే తెలియాలి.

ఓవైపు చంద్రబాబు అస్త్ర సన్యాయం చేసి దిగాలుగా కూర్చుంటే, రెండు సర్పంచి సీట్లు గెలిచిన పవన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ రెచ్చిపోవడం కాస్త విడ్డూరంగానే ఉంది. పవన్ కి కూడా జ్ఞానోదయం అయ్యేరోజు త్వరలోనే ఉందని అంటున్నారు నెటిజన్లు. 

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×