cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ ఓటు బ్యాంక్ భలే చీల్చాడుగా!

పవన్ ఓటు బ్యాంక్ భలే చీల్చాడుగా!

గత ఎన్నికల్లో ట్రంప్ కార్డులా సడెన్ గా తెరపైకొచ్చారు పవన్. అనూహ్యంగా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. పవన్ చలవతో మేం గెలవలేదని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నప్పటికీ.. వైసీపీకి అధికారాన్ని దూరంచేసింది మాత్రం పవన్ మాత్రమే అంటారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి పవన్ ఈసారి ఎన్నికల్లో సోలోగా బరిలోకి దిగారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఓటు బ్యాంక్ ను చీల్చేస్తానని చెప్పుకున్నారు.

విశ్లేషకులు కూడా ఈ దిశగా చాలా రివ్యూలు ఇచ్చారు. జనసేన సోలోగా దిగడంతో టీడీపీ ఓట్లు అన్నీ చీలిపోతాయని, గత ఎన్నికల్లో పవన్ ను చూసి టీడీపీకి ఓట్లు వేసిన జనాలంతా ఈసారి గాజు గ్లాసుపై గుద్దేస్తారంటూ ఎనాలిసిస్ లు వచ్చాయి. కానీ తాజా ఫలితాలతో సీన్ రివర్స్ అయింది.

టీడీపీ ఓటు బ్యాంక్ ను పవన్ చీల్చిన మాట వాస్తవం. ఆ విషయం కనిపిస్తూనే ఉంది. కానీ అలా చీలిన ఓటు ఏదీ జనసేనకు పడలేదు. నేరుగా వెళ్లి వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఈ పరిణామాన్ని మాత్రం జనసేన ఊహించలేదు. నిన్నటివరకు నిశ్శబ్ద విప్లవం అంటూ జనసైనికులు ధీమాగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడదే రివర్స్ అయింది. పార్టీ ఖాళీగా మిగిలింది.

ఒక దశలో టీడీపీ కూడా ఇదే భయాన్ని వ్యక్తంచేసింది. జనసేన ఒంటరిగా పోటీచేస్తే అది టీడీపీ ఓటు బ్యాంకును చీలుస్తుందని భావించింది. అందుకే పైకి శత్రువులుగా నటించినా, తెరవెనక మాత్రం పవన్ తో రహస్య స్నేహాన్ని కొనసాగించింది ఆ పార్టీ. ఒకవేళ ఓటు చీలి జనసేనకు భారీగా సీట్లు వస్తే మళ్లీ కలిసిపోవచ్చనేది చంద్రబాబు కుతంత్రం.

కానీ బాబు ఆలోచన పారలేదు. జనసేన ఆశ నెరవేరలేదు. వార్ వన్ సైడ్ అయింది. ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది. వైసీపీని అఖండ విజయం వరించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారత రాజకీయ చరిత్రలోనే ఇదొక సువర్ణ అధ్యాయం. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా