Advertisement

Advertisement


Home > Politics - Political News

దయలేని దత్తపుత్రుడు.. బాబు బాధ వర్ణనాతీతం

దయలేని దత్తపుత్రుడు.. బాబు బాధ వర్ణనాతీతం

విశాఖలో చంద్రబాబుకి జరిగిన శాస్తిపై పవన్ కల్యాణ్ ఇంకా నోరువిప్పలేదేంటా అని చాలామందిలో అనుమానం ఉంది. బాబుపై ఈగ వాలనీయని జనసేనాని అంత రాద్ధాంతం జరిగినా ఎందుకు ఇంకా సైలెంట్ గా ఉన్నారు, అలవాటులో పొరపాటుగా పత్రికా ప్రకటన కూడా ఎందుకు విడుదల చేయలేదన్న విషయం జనసేన వర్గాలకు కూడా అంతు చిక్కలేదు. పవన్ సైలెన్స్ కి అసలు కారణం బీజేపీయేనని తెలుస్తోంది.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎలాంటి స్టేట్ మెంట్లివ్వాలన్నా.. అన్నిటికీ బీజేపీ అధిష్టానం అనుమతి తప్పనిసరి అవుతోంది. ఇప్పటివరకూ చంద్రబాబు డైరక్షన్లో పనిచేసిన పవన్, ఇప్పుడు బీజేపీ అనుమతితో మాట్లాడాల్సి వస్తోంది. అందుకే విశాఖలో చంద్రబాబుకి జరిగిన "సన్మానం"పై పవన్  నోరెత్తలేదు. కనీసం ఖండించ లేదు కూడా.

ఆ మాటకొస్తే.. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలపై పవన్ వెంటనే స్పందిస్తుంటారు. జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంటారు. నిన్న మొన్నటి వరకూ మూడు రాజధానులపై కూడా అలాగే నెగెటివ్ గా స్పందించారు పవన్. కానీ బీజేపీతో జతకలిశాక.. ఆ అత్యుత్సాహానికి బ్రేక్ పడింది. బీజేపీ కూడా పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గుచూపుతున్న కారణంగా పవన్ తనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ విషయంలో అస్త్ర సన్యాసం చేశారు.

ప్రస్తుతం చంద్రబాబుకి విశాఖలో వచ్చిన వ్యతిరేకత కూడా ఆయన అమరావతి ఉద్యమాల పుణ్యమే. విశాఖను పాలనా రాజధానిగా ఒప్పుకోని బాబుకి అక్కడ అడుగుపెట్టే అర్హత లేదంటూ స్థానికులు అడ్డుకున్నారు. అది పూర్తిగా ఆయన స్వయంకృతాపరాథం. అందుకే బీజేపీ ఆ విషయంలో స్పందించలేదు, తమ మిత్రుడు పవన్ నోరు కూడా కట్టేసింది. ఈ కారణంతోనే పవన్ తన బాస్ చంద్రబాబుకి అంత ఘోర అవమానం జరిగినా మౌనం వహించారు. తన షూటింగ్ లేవో తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉన్నారు.

అమరావతిలో ర్యాలీ కోసం వెళ్లిన పవన్ కల్యాణ్ ని ముళ్లకంచెకు అవతల పెడితే.. పెదబాబు, చినబాబు ఎంత హంగామా చేశారో అందరికీ తెలుసు. అదే సింపతీ ఇప్పుడు తమ మీద పవన్ కూడా చూపిస్తాడనుకున్న చంద్రబాబుకు షాక్ తగిలింది. జనసేనాని హ్యాండిచ్చేశారు. జనం కొట్టిన దెబ్బ కంటే.. పవన్ స్పందించకపోవడం బాబుకి ఇంకా పెద్ద నొప్పిగా మారింది.

దేన్నీ ఎవరూ ఆపలేరు

పోలవరం ప్రాజెక్ట్ స్పీడ్ పెంచిన వైఎస్ జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?