cloudfront

Advertisement


Home > Politics - Political News

వెన్నుపోటు తప్పదని తెలుసు.. అదే జరిగింది

వెన్నుపోటు తప్పదని తెలుసు.. అదే జరిగింది

తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు స్పెషలిస్ట్ ఎవరంటే గుక్కతిప్పుకోకుండా వచ్చే సమాధానం చంద్రబాబు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచి, ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీ పక్కనచేరి, ఆ తర్వాత వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు తనకు కూడా అలాంటి అనుభవమే ఎదురైందని అంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

"సొంత మామ(ఎన్టీఆర్)నే దెబ్బకొట్టిన వ్యక్తి, నన్ను ఎదగనిస్తాడని ఎందుకు అనుకుంటాను. నేను అంత అమాయకుడినా. పంచె కట్టుకుంటే అమాయకుడ్ని అయిపోతానా. చంద్రబాబు నన్ను వాడుకొని వదిలేస్తారని నా సన్నిహితులు, మిత్రులు అందరూ చెప్పారు. ఏదో ఒక రోజు నాకు వెన్నుపోటు తప్పదని తెలుసు. అదే జరిగింది."

పిఠాపురం పబ్లిక్ మీటింగ్ లో ఇలా తన వెన్నుపోటు వివరాల్ని బయటపెట్టారు పవన్. గత ఎన్నికల టైమ్ లో తనను వాడుకొని, ఆ తర్వాత కూరలో కరివేపాకులా తనను తీసి పడేశారనే అర్థంవచ్చేలా మాట్లాడారు. కానీ వెన్నుపోటు పొడిపించుకోవడానికి తను ఎన్టీఆర్ ను కాదంటున్నారు పవన్.

"వెన్నుపోటు పొడిపించుకోవడానికి ఎన్టీఆర్ అంత మంచి వ్యక్తిని కాదు నేను. ఎన్టీఆర్ మంచి వ్యక్తి. పవన్ కల్యాణ్ అనేవాడు మాత్రం అలా చూస్తూ ఊరుకోడు. నన్ను వెన్నుపోటు పొడిస్తే రోడ్డుపైకి లాగి, చొక్కా విప్పి కూర్చోబెడతాను. ఉంటే ఉంటా లేకపోతే పోతా నాకు అలాంటి భయాల్లేవు. టీడీపీ నాకు అండగా ఉంటుందని ఎప్పుడూ ఆశించలేదు."

త్వరలోనే టీడీపీ చొక్కా విప్పి, నడిరోడ్డుపై నిలబెడతానంటున్నారు జనసేనాని. బీజేపీకి మద్దతుగా ఉంటున్నాననంటూ తనపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని బలంగా తిప్పికొట్టారు పవన్. లోకేష్ కొడుకు మోడీని తాత అని పిలుస్తాడని, తనకు ప్రధానితో అలాంటి బంధుత్వాలు లేవన్నారు.

"నేను మొదట్నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూనే ఉన్నాను. టీడీపీ వాళ్లే నాపై ఏవేవో కల్పిస్తున్నారు. బీజేపీని నేను బలంగా వ్యతిరేకిస్తుంటే నేను-మోడీ ఒకటంటూ టీడీపీ కథలు అల్లుతున్నారు. మోడీని లోకేష్ అబ్బాయి తాత..తాత అని పిలుస్తుంటాడట. ఆమధ్య పొద్దున్న లేస్తే టీడీపీ వాళ్లు చెప్పే మాట ఇది. ఇప్పుడు చెప్పండి బంధుత్వాలు మీకున్నాయా.. మాకున్నాయా. నేను సొంత అన్నయ్య చిరంజీవినే ఎదిరించిన వాడ్ని, మోడీ నాకో లెక్క? నాకు మోడీ అంటే మోజు లేదు, భయం లేదు. కానీ దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఇస్తాను."

జగన్ పై ఎవరో దాడిచేస్తే, ఆ ఘటనను కూడా జనసేనకు ఆపాదించే ప్రయత్నం చేశారని, టీడీపీ చేస్తున్న ఇంత నీచ రాజకీయాల్ని తన జీవితంలో చూడలేదంటున్నారు పవన్. జగన్ హత్యకు కుట్రపై అనవసరంగా రాద్దాంతం తగదన్నారు.

"జగన్ పై ఓ వ్యక్తి కోడికత్తితో దాడిచేశాడు. ఆ వ్యక్తిని జనసైనికుడు అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేసింది టీడీపీ. ఎవరు ఎవరితో రంకు చేసినా జనసేనే సమాధానం చెప్పాలా. జగన్ ను ఎవరో పొడిస్తే, జనసేనపై దుమ్ము వేస్తారా? దాడి జరిగిన వెంటనే సానుభూతి తెలపడం కూడా తప్పా? మీకు (చంద్రబాబు) ఎలాగూ సానుభూతి తెలపడం రాదు. మమ్మల్ని కూడా మీలా తయారవ్వమంటారా?"

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడ్డం, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటన్నారు పవన్. ఇకనైనా చంద్రబాబు, లోకేష్ తమ నాలుకల్ని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే టీడీపీ వీపుపై దెబ్బల మోత మోగిపోతుందని హెచ్చరించారు. 

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్