cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ సీఎం అయ్యారు.. కావాలంటే ఆ ఛానెల్ చూడండి!

పవన్ సీఎం అయ్యారు.. కావాలంటే ఆ ఛానెల్ చూడండి!

ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా అనుభవిస్తున్నారు. ఆ తర్వాత జగన్ కే ఎక్కువ అవకాశాలంటూ ఇప్పటికే సర్వేలు కోడై కూస్తున్నాయి. అయితే సందట్లో సడేమియా అన్నట్టు పవన్ కల్యాణ్ కూడా సీఎం అయిపోయారు. అవును.. జనసేన అధ్యక్షుడే భావి ముఖ్యమంత్రి. కావాలంటే 99టీవీ చూడండి.

చంద్రబాబులా, జగన్ లా నాకు సొంత మీడియా లేదు, నాకు ప్రజలే మీడియా, ప్రజల ఫేస్ బుక్ ఎకౌంట్లే నాకు ఛానెళ్లు అంటూ బీద అరుపులు అరిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తన సొంతడబ్బా బాగానే వాయించుకుంటున్నారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియానే నమ్ముకున్న పవన్ కి ఆయన సొంత ఛానెల్ 99టీవీ చేస్తున్న ప్రచారం పరాకాష్టకు చేరుతోంది.

ఆ ఛానెల్ చూసిన వారెవరికైనా రాష్ట్రంలో జనసేన తప్ప ఇంకే పార్టీ లేనట్టు, పవన్ తప్ప మరే నాయకుడూ రాష్ట్రంలో లేడన్నట్టు అనిపించడం ఖాయం. 2019లో ఏపీకి పవనే ముఖ్యమంత్రి అని, పవన్ రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధే జరగదని, పేదరికం పోదని హితబోధ చేస్తోంది సదరు ఛానెల్.  ప్రస్తుతానికి పవన్ భజన తప్ప మరే పనీ పెట్టుకోలేదు ఆ ఛానెల్.

ఏపీ ఎన్నికల ఫ్లాష్ సర్వే పేరుతో వస్తున్న ప్రోగ్రామ్ టీడీపీ, వైసీపీల వైపు కాకుండా జనమంతా జనసేన వైపు ఉన్నారని తేల్చిచెప్పింది. భజన ఉండొచ్చు, మరీ ఇంతగా చేయాలా అంటూ ఈ ప్రోగ్రామ్ లు, ఇంటర్వ్యూలపై సెటైర్లు పడుతున్నాయి. సొంత డబ్బా కొట్టినా.. జనాలు ఆ ఛానెల్ కి ట్యూన్ కావాలంటే చాలా టైమ్ పడుతుంది.

అయితే ఇది ఎన్నికల సీజన్. ఎవరికైనా ఆమాత్రం స్వామిభక్తి తప్పదు. పవన్ కల్యాణ్ కూడా ఈమధ్య మీడియా మేనేజ్ మెంట్ బాగానే నేర్చుకున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా తనని పక్కన పెట్టేసిందనే ఉద్ధేశంతో పవన్ ఇలా తనకంటూ ఓ 3 ఛానెళ్లు పెట్టుకున్నారు. దీనికి ఓ దినపత్రిక అదనం. ఇవన్నీ కలిసి ఇప్పుడు పవన్ ను ముఖ్యమంత్రిని చేసేశాయి. 99టీవీ అయితే మరీనూ.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?