cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్.. గాజువాకలోనూ గెలుపును ఆశించడం లేదా!

పవన్.. గాజువాకలోనూ గెలుపును ఆశించడం లేదా!

తాము గెలుపును ఆశించి పని చేయలేదని, సీట్లను సాధించాలని ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తమ రాజకీయం అలాంటిది కాదని పవన్ చెప్పుకొచ్చారు! వీరాభిమానులకు పవన్ ఇలాంటి మాటలు చెబితే బాగుంటుందేమో కానీ.. ఇప్పుడు పవన్ చెబుతున్న థియరీలను బట్టి ఓటమికి పవన్ రీజన్లను ప్రిపేర్ చేస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.

ఎలాగూ ఓటమి తప్పదనే భావనతోనే పవన్ ఇలా మాట్లాడుతూ ఉన్నారని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి గెలుపును ఆశించడం లేదు, సీట్ల లెక్కలు అవసరం లేదు కేవలం ఓట్లు మాత్రమే చాలంటున్న పవన్ కల్యాణ్ ఈ మాటలను ఎన్నికల ముందే ఎందుకు చెప్పలేదు అనేది మరో ప్రశ్న.

పోలింగ్ పూర్తి అయ్యాకా పవన్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. కనీసం భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో అయినా పవన్ విజయాన్ని ఆశించారా? లేక అక్కడ కూడా ఓట్లు వస్తే చాలనుకుంటున్నారా? అనే సందేహాలు నెలకొంటున్నాయిప్పుడు.

భీమవరంలో పవన్ కల్యాణ్ హ్యాండ్సప్ అనేమాట పోలింగ్ ముందు నుంచినే వినిపిస్తోంది. పవన్ గెలిచినా భీమవరం సీటుకు రాజీనామా చేస్తాడనే లెక్కలతో అక్కడి ఓటర్లు ఆయనను ముందే లైట్ తీసుకున్నారనే అభిప్రాయం అప్పటి నుంచినే వినిపిస్తోంది.

ఇక గాజువాక విషయంలో ఇప్పుడు మరిన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గాజువాకలో జనసేన అధిపతి ఎమ్మెల్యేగా నెగ్గినా అక్కడి స్థానికులకు అందుబాటులో ఉండే అవకాశం లేదనే విశ్లేషణలు అక్కడి జనాల్లో ముందు నుంచినే ఆలోచనను రేపాయని అంటున్నారు. సినీస్టార్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రయోజనాలు ఉండవని హిందూపురం వంటి సీటును చూస్తే అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది.

ఆ డ్యామేజ్ ను కవర్ చేయడానికి తను గాజువాకకు అందుబాటులో లేకపోయిన.. తనకు ప్రత్యామ్నాయంగా స్థానిక జనసేన నేతలు అందుబాటులో ఉంటారని, షాడో ఎమ్మెల్యే ఒకరు ఉంటారని పవన్ చెప్పాడట. తను గెలిస్తే వారే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారన్నట్టుగా పవన్ చేసిన ప్రకటన అక్కడ ఆయనకు మరింత నష్టం చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

గాజువాకకు షాడో ఎమ్మెల్యేగా ఒకనేత పేరును చెప్పడం, తను గెలిస్తే ఆయన అక్కడ రాజ్యం నడిపిస్తాడని పవన్ తన వాళ్ల మధ్యన ప్రకటించడం మొదటికే మోసం తెచ్చిందని, గాజువాకలో పవన్ అవకాశాలను అది మరింతగా దెబ్బతీసిందనే మాట పోస్ట్ పోల్ ఎనాలిసిస్ లో వినిపిస్తోంది!

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ