Advertisement


Home > Politics - Political News
పవన్ కల్యాణ్ ఒక బచ్చా: టీడీపీ ఎంపీ

పవన్ కల్యాణ్ ఒక బచ్చా.. అని అంటున్నాడు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు జేసీ. కేవలం పవన్ మీద మాత్రమే కాదు, చిరంజీవిని ఉద్దేశించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఈ నేత.

వెనుకటికి చిరంజీవి తన కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీ పెట్టాడు అని, ఆయన కథ ఏమైంది? అని జేసీ ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ కు ఆ మాత్రం కూడా ఉండదని జేసీ వ్యాఖ్యానించాడు.

రాజకీయం అంటే సినిమాల్లో నటించినంత ఈజీ కాదన్నాడు జేసీ. ఇక చంద్రబాబు దీక్షను, తెలుగుదేశం నేతల ఒక రోజు దీక్షపై కూడా జేసీ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ దీక్షలతో ఏ మాత్రం ప్రయోజనం లేదని జేసీ తేల్చేశాడు.

ఇలాంటి దీక్షలు ఢిల్లీలో వెళ్లి చేయాలని సొంత పార్టీ నేతలకు సలహా ఇచ్చాడు దివాకర్ రెడ్డి. చంద్రబాబుకు కొంపలు ముంచే తెలివి తేటలు ఉన్నాయని జేసీ చెప్పుకొచ్చాడు. చంద్రబాబు గొంతుల్లోతు కష్టాల్లో ఉన్నాడని జేసీ అన్నాడు.

మోడీకి చంద్రబాబుపై అసూయ అని, అందుకే రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని జేసీ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే, ఇప్పుడైతే పవన్ ను జేసీ బచ్చా అని అంటున్నాడు. వెనుకటికి ఇదే బచ్చాతో అనంతపురంలో తన కోసం ఎన్నికల ప్రచారం చేయించుకున్నాడు కదా ఈయన!