cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచి అంటే..!

పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచి అంటే..!

తను అనంతపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా చాన్నాళ్ల కిందటే ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అయితే ఆ తర్వాత ఆ ఊసు ఎత్తడంలేదు ఈ నటుడు. ఆ తర్వాత పవన్ పోటీ విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. అయితే.. ఫలానా చోట నుంచి అనే విషయం మాత్రం ఖరారు కావడంలేదు. ఆ సంగతలా ఉంటే.. ఇంతలో జనసేన అప్లికేషన్ల వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపికకు అప్లికేషన్లను ఆహ్వానించారు. ముందుగా పవన్ కల్యాణే అప్లికేషన్ పెట్టుకున్నారు  కూడా.

మరి ఇంతకీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పవన్ కల్యాణ్ అప్లికేషన్ పెట్టుకున్నారు? అనేది టక్కున రైజ్ అయిన ప్రశ్న. పవన్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు అని ప్రకటించిన జనసేన.. ఇంతకీ ఎక్కడ నుంచి పోటీ చేయడానికి పవన్ అప్లికేషన్ పెట్టుకున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయింది!

అంటే నియోజకవర్గం ఏదో కూడా మెన్షన్ చేయకుండానే పవన్ దరఖాస్తు పెట్టేసుకున్నారా! ఇదేం కామెడీ! అనే కామెంట్లూ వినిపించాయి జనసేన తీరు మీద. అయితే ఇప్పుడు అందుకు సంబంధించి వివరణ ఇచ్చుకుంది జనసేన అభ్యర్థుల  ఎంపిక కమిటీ!

పవన్ కల్యాణ్ దరఖాస్తు పెట్టుకున్నది వాస్తవమే అని.. నియోజకవర్గం పేరును పవన్ మెన్షన్ చేయలేదు అని జనసేన కమిటీ ప్రకటించుకుంది. అదేంటి అంటే.. తను ఎక్కడ నుంచి పోటీ చేయాలో.. తగిన నియోజకవర్గాన్ని కూడా కేటాయించాలని పవన్ కల్యాణ్ కమిటీకి అప్లికేషన్ పెట్టుకున్నారట. ఇదీ కథ.

తనకు ఎక్కడ నుంచి టికెట్ కావాలో కోరింది ఏమీలేదట.. తను ఎక్కడ నుంచి పోటీచేయాలో చెప్పాలని కమిటీని కోరారట పవన్! ఈ రకంగా పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచి? అనేది ఇంకా మిస్టరీనే! ఈ విషయాన్ని కమిటీనే తేలుస్తుందనమాట. 

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!