Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్-ఓ డబ్బింగ్ రిపోర్టు

పవన్-ఓ డబ్బింగ్ రిపోర్టు

సినిమా డైలాగుల వెనుక మూడు అంచెల కార్యక్రమం వుంటుంది. కథను బట్టి, సన్నివేశాలను బట్టి డైలాగు రైటర్ రాస్తారు. సన్నివేశాన్ని బట్టి, డైరక్టర్ అభిరుచిని, సలహాను తీసుకుని తన శైలిలో హీరో చెబుతాడు. మళ్లీ తరువాత డబ్బింగ్ థియేటర్ లో ఒకటికి పదిసార్లు సరిగ్గా వచ్చేదాకా అదే డైలాగును మళ్లీ జాగ్రత్తగా చెబుతారు. ఇదీ ప్రాసెస్.

కానీ ఆ డైలాగుల కష్టం అంతా తమ హీరోదే అని అనుకుంటారు అభిమానులంతా. అలా నమ్మించడంలో హీరో చాకచక్యం అంతా దాగి వుంటుంది. హీరో నుంచి జనసేధిపతిగా మారిన పవన్ కళ్యాణ్ తాజాగా వైకాపా వంద రోజుల పాలన మీద ఇచ్చిన సుదీర్ఘమైన ప్రసంగం వింటే సరైన రిహార్సల్ లేకుండా చేసిన డబ్బింగ్ వ్యవహారంగా కనిపించింది.

ఈ ప్రసంగానికి స్క్రిప్ట్ డైరక్టర్లు జనసేన మీడియా విభాగం లేదా రీసెర్చి విభాగం జనాలు. అందులో అణుమాత్రం సందేహంలేదు. అయితే డైరక్షన్ మాత్రం ఎవ్వరూ వుండరు. పవన్ ను తనను తాను మాత్రమే డైరక్ట్ చేసుకుంటారు. స్క్రిప్ట్ ఆయనకు అందిస్తేచాలు. అలా అందించేది తేదేపా అని కిట్టనివాళ్లు అంటారు. జనసేన బ్యాక్ ఎండ్ పనిమంతులు అని కొందరు అంటారు. ఏమయితేనే ఎలా చెప్పాలి. ఎక్కడ హై పిచ్ కు వెళ్లాలి, ఎక్కడ చేతులు ఊపాలి. అవన్నీ పవన్ తనకు తాను చూసుకుంటారు.

సమస్య ఏమిటంటే, వంద రోజుల పాలన మీద తీసుకున్న సబ్జెక్ట్ బాగా డ్రయ్ గా వుంది. అందుకే హావభావాలకు అవకాశం లేదు. అందువల్ల ముందున్న పేజీలకు పేజీల స్క్రిప్ట్ ను అలా చదువుతూపోయారు. ఇలా చేయడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ లేదు. పైగా ఏ స్క్రిప్ట్ కు అయినా కొత్తదనం అవసరం. స్క్రిప్ట్ లో నావెల్టీ లేకుంటే జనాలు పక్కన పెడుతున్నారు. పవన్ చదివిన స్క్రిప్ట్ లో అస్సలు నావెల్టీ లేదు. ఇప్పటికే ఇంచుమించు ఇలాంటి స్క్రిప్ట్ ను తెలుగుదేశం నాయకులు అనేకసార్లు ఏకరవు పెట్టేసారు. టీవీ చర్చల్లో వినిపించేసారు. తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రచురించేసారు. దాంతో పవన్ కొత్తగా చెప్పిన పాయింట్ ఒక్కటి లేకుండా పోయింది.

గ్యాస్ సిలెండర్ ఫ్రీ వగైరా. మరి వాటికి డబ్బులు ఖర్చుకావా? అంతెందుకు చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజులు ముందు చేసిన పందేరాలు, ఎన్నికలకు కుప్పించిన హామీల సంగతేమిటి? ఒకవేళ చంద్రబాబే అధికారంలోకి వచ్చి వుంటే, ఆ హామీలు అన్నీ అమలు చేయాల్సిందే కదా?  అప్పుడు ఎన్నివేల కోట్లు అవుతుంది? అప్పుడూ పవన్ ఇలాగే మాట్లాడేవారా?

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?