cloudfront

Advertisement


Home > Politics - Political News

పోటీ విషయంలో మాట మార్చిన పవన్ కల్యాణ్!

పోటీ విషయంలో మాట మార్చిన పవన్ కల్యాణ్!

తను అనంతపురం నుంచి పోటీ చేస్తానని అప్పుడెప్పుడో ప్రకటించాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఒకరోజు మాట్లాడిన మాటనే రెండోరోజు రిపీట్ చేయడు పీకే. అలాంటిది ఇతడు అప్పుడెప్పుడో చేసిన ప్రకటన మీద నిలబడతాడని అనుకోవడం భ్రమే. అందుకే తాజాగా మరోసారి తన పోటీ విషయంలో ప్రకటించాడు. ఈసారి మాత్రం పవన్ ఇంకా తేల్చుకోలేదని చెప్పాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అంశం గురించి ప్రకటిస్తానని పవన్ ప్రకటించాడు. గతంలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని అన్నారు  కదా, తాజాగా అనంతపురంలోనే కదా పర్యటించారు.. కాబట్టి ఏమైనా ధ్రువీకరిస్తారేమో అనుకుంటే.. ఇంకా తేల్చుకోలేదని కొత్త విషయాన్ని ప్రకటించాడు.

అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి.. ఇప్పుడేమో ఎక్కడ నుంచి పోటీచేసే అంశం ఫిబ్రవరిలో తేలుస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నాడు. ఇప్పటికే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనే అంశంపై జనసేన వర్గాలు చాలామాటలు చెప్పాయి. ప్రధానంగా కాపుల జనాభా ఎక్కడ అధికంగా ఉందో అక్కడే పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నాడనే మాట వినిపిస్తోంది.

తనకు కులంలేదని, తను కుల రాజకీయం చేయనని అందరూ కులం వెనుక తోకలు కత్తిరించుకోవాలని ఒక టీవీ చానల్ వారి మాదిరి నీతులు చెబుతున్న పవన్ కల్యాణ్.. తన పోటీ విషయంలో మాత్రం కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్